టైల్స్ ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published | Jun 2, 2024, 9:55 AM IST

టైల్స్ ఇంటిని నీట్ గా కనిపించేలా చేస్తాయి. కానీ టైల్స్ ను రెగ్యులర్ గా క్లీన్ చేయకపోతే అవి మురికిగా కనిపిస్తాయి. ముఖ్యంగా టైల్స్ మూలల్లో చాలా మురికి పేరుకుపోతుంది. దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టమన్న సంగతి ఆడవాళ్లందరికీ తెలిసిందే. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో టైల్స్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే?
 

ఇంటి నుంచి బాత్రూం వరకు టైల్స్ క్లీన్ చేయడానికి ఆడవాళ్లు బాగా కష్టపడుతుంటారు. అందరూ ప్రతిరోజూ ఇళ్లను శుభ్రపరుస్తారు. కానీ  టైల్స్, డోర్ అంచులు, టాయిలెట్ షీట్ల  అంచుల్లో పేరుకుపోయిన మురికి మాత్రం పోదు. వీటి గురించి చాలా మంది పట్టించుకోరు. దీనివల్లే అవి మొండి మరకలుగా మారుతాయి. అందుకే వీటిని రోజూ క్లీన్ చేసినా మురికిగానే కనిపిస్తాయి. ఈ ప్రదేశాలను శుభ్రం  చేయడానికి చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. వీటిని క్లీన్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. కానీ వీటిని కొన్ని ట్రిక్స్ తో చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. 

టైల్స్ అంచులను ఎలా శుభ్రం చేయాలి?

సోడా 

టైల్స్ మూలలను శుభ్రం చేయడానికి మీరు సాదా సోడాను ఉపయోగించొచ్చు. ఇందుకోసం సోడాను నీళ్లలో కలిపి ద్రవాన్ని తయారుచేయండి. దీన్ని స్ప్రే బాటిల్ లో నింపి మూలలపై స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో పేరుకుపోయిన మురికి ఈజీగా తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు స్క్రబ్ సహాయంతో రుద్దితే మురికి వదిలిపోతుంది. 
 


floor cleaning

కూల్ డ్రింక్స్

ఎండాకాలంలో చాలా ఇళ్లలో కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ ను బాగా తాగుతుంటారు. అయితే చాలా సార్లు కూల్ డ్రింక్స్ ను ఓపెన్ చేసి పెట్టడం వల్ల అవి పాడైపోతుంటాయి. వీటిని పారేస్తుంటారు. కానీ ఈ కూల్ డ్రింక్స్ సహాయంతో మీరు టైల్స్ ను కూడా శుభ్రం చేయొచ్చు. టైల్స్ ను శుభ్రం చేయడానికి కూల్ డ్రింక్స్ ను  స్ప్రే బాటిల్ లో వేసి టైల్స్ మూలల్లో స్ప్రే చేసి బ్రష్ తో రుద్దండి. అయితే స్ప్రే చేసిన వెంటనే దీన్ని క్లీన్ చేయాలి. లేదంటే టైల్స్ పై మరకలు ఏర్పడతాయి. 

నిమ్మకాయను 

మురికిని శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మరసం, బేకింగ్ సోడాను వేసి కలపండి. ఇప్పుడు టూత్ బ్రష్ ను దీనిలో ముంచి టైల్స్ అంచును శుభ్రం చేయండి.  అలాగే టైల్స్ అంచును శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడా, వెనిగర్, నారింజ తొక్కలను ఉపయోగించొచ్చు. 

Latest Videos

click me!