జుట్టుకు మెరుపు తెస్తుంది
చాలా మంది జుట్టు పొడుగ్గా ఉన్నా నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి జుట్టుకు కూడా కర్పూరం కలిపిన నూనె మంచి ప్రయోజకరంగా ఉంటుంది. దుమ్ము, ధూళి వల్ల జుట్టు మెరుపు పోతుంది. కొబ్బరినూనె, కర్పూరం ఇందుకు ఎంతో మేలు చేస్తాయి. ఇది జుట్టును నేచురల్ గా స్మూత్ గా చేసి షైనింగ్ ఇస్తుంది.