నువ్వులు తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయా?

First Published | Jan 4, 2024, 2:57 PM IST

చలికాలంలో నువ్వులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని ఉపయోగించి మీరు ఎన్నో సమస్యలు తగ్గించుకోవచ్చు. నిపుణుల ప్రకారం.. నువ్వులను తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి. అది ఎలాగంటే..
 

Black Sesame Seeds

నువ్వులు పోషకాల భాండాగారం. చలికాలంలో నువ్వులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే లడ్డూల నుంచి చక్లీల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు హార్మోన్ల అసమతుల్యత ఒక కారణం. అయితే ఈ సమస్యను పోగొట్టడానికి నువ్వులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవును కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే నువ్వుల్లో వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తగ్గిస్తుందని చెప్తారు. నువ్వుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నువ్వుల గురించి పరిశోధన ఏం చెబుతోంది

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ మొత్తాన్ని పెంచుతుంది. నువ్వులలో లిగ్నన్లు అంటే ఫైబర్ అధికంగా ఉండే సమ్మేళనాలు కూడా ఉంటాయి. రుతుస్రావం లూటియల్ దశ అంటే 15 వ రోజు నుంచి 28 వ రోజు వరకు సంభవించే రెండవ దశ. ఈ సమయంలో నువ్వులు తినాలి. ఇది పీరియడ్ చక్రాన్ని క్రమబద్ధం చేస్తుంది.
 

Latest Videos


యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నువ్వులు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. పరిశోధనల ప్రకారం.. నువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అధిక స్థాయి ఈస్ట్రోజెన్ గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. ఇది రక్తస్రావానికి కారణమని రుజువు చేయబడింది. 
 

నిపుణుల ప్రకారం.. నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. కానీ పీరియడ్స్ త్వరగా రావడానికి మీరు దీన్ని ఉపయోగిస్తుంటే.. అది ప్రయోజనకరంగా కాకుండా హాని చేస్తుంది. వీటిని మితంగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ లో రక్తస్రావం లేదా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో ఉండే జింక్, ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని పెంచుతాయి.

నువ్వులు రుతుచక్రాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి

నువ్వులు రుతుస్రావాన్ని ప్రేరేపిస్తాయి లేదా నియంత్రిస్తాయనే వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్ సైకిల్ అనేది హార్మోన్ల మార్పుల ద్వారా ప్రభావితమయ్యే ప్రక్రియ. ఇది ఒత్తిడి, పోషణ,  మొత్తం ఆరోగ్యం వల్ల ప్రభావితమవుతుంది. ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు నువ్వుల్లో లభిస్తాయి. మీరు క్రమరహిత రుతుచక్రం సమస్యను ఎదుర్కొంటుంటే.. దీని కోసం నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే నువ్వులను తినండి. 
 

నువ్వులు ఎంత తినాలి?

రుతుక్రమం క్రమం తప్పకుండా ఉండాలంటే శీతాకాలంలో 1 టీస్పూన్ నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి  నువ్వులను నానబెట్టి వేసవిలో తీసుకోవచ్చు. దీని వాడకం ద్వారా సంతానలేమి సమస్యను కూడా అధిగమించొచ్చు. దీన్ని మితంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

click me!