1. కావల్సిన పదార్థాలు
ముల్తానీ మిట్టి - 2 టీస్పూన్లు
రోజ్ వాటర్ - 2 టీస్పూన్లు
ఎలా తయారు చేయాలి..
ముల్తానీ మట్టిని, రోజ్ వాటర్ ను బాగా కలపండి. తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేయాండి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది.