రాత్రిపడుకునే ముందు తేనెలో ఇది కలిపి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 10, 2024, 10:20 AM IST

తేనె, వెల్లుల్లి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల.. మీ చర్మ కాంతిని రెట్టంపు చేసుకోవచ్చు. అది ఎలా..? ఈ రెండూ కలిపి తింటే అందం ఎలా పెరుగుతుంది..? వీటిని ఎలా తినాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రోజుల్లో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి పోరాడటానికి ఏవోవే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్  ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా..  ఎలాంటి రిజల్ట్ రావడం లేదని విసుగెత్తిపోతూ ఉంటారు. మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా కూడా.. మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఎలాంటి స్కిన్ సమస్యలను అయినా పరిష్కరించగల పరిష్కారం మా దగ్గర ఉంది.

మీరు ఖరీదైన క్రీములు తెచ్చి ముఖానికి పూయాల్సిన అవసరం లేదు. మీ డైట్ లో కేవలం ఒక ఫుడ్ ని భాగం చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీ వంటింటిలో సులభంగా లభించే రెండు పదార్థాలను తినడం వల్ల.. మీ అందం రెట్టింపు అవుతుందని మీకు తెలుసా? ఆ రెండు మరేంటో కాదు.. తేనె, వెల్లుల్లి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల.. మీ చర్మ కాంతిని రెట్టంపు చేసుకోవచ్చు. అది ఎలా..? ఈ రెండూ కలిపి తింటే అందం ఎలా పెరుగుతుంది..? వీటిని ఎలా తినాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...


అసలు.. అందాన్ని పెంచడానికి తేనె ఎలా ఉపయోగపడుతుంది..?

తేనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని గొప్పగా మార్చడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా. తేనె చర్మాన్ని మంచిగా మాయిశ్చరైజ్డ్ గా ఉంచేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.  ఏదైనా చర్మంపై గాయాలు జరిగినా.. వాటిని తగ్గించడంలోనూ సహాయం చేస్తుంది.
 

garlic

చర్మానికి వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలేంటి అంటే..?
మనం పెద్దగా పట్టించుకోం కానీ.. వెల్లుల్లి మన చర్మంపై అద్భుతాలు చేస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొల్లాజెన్ తగ్గకుండా ఉంటుంది. ఇది మిమ్మల్ని తొందరగా వృద్ధాప్యం రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది. తేనెలాగానే.. వెల్లుల్లిలోనూ  యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఈ రెండూ సరైన చర్మ ఆరోగ్యానికి అవసరం. 

మరి మెరిసే చర్మం కోసం ఈ రెండూ ఎలా కలిపి తీసుకోవాలి..?
ఈ మిశ్రమాన్ని తినడానికి, వెల్లుల్లి రెబ్బలను బాగా కడిగి, చిన్నగా కట్ చేయాలి. ముక్కలు. తరిగిన వెల్లుల్లిని ఒక చెంచాలో తీసుకుని, దానిపై పచ్చి తేనె వేయండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఈ కాంబోని తినండి. ఇది మీ చర్మాన్ని ఎలా మారుస్తుందో చూడండి. వెల్లుల్లి తినడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది అనుకుంటే... ఇది తిన్న పది నిమిషాల తర్వాత బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. కానీ.. రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీ అందం రెట్టింపు అవ్వడంతో పాటు..ముఖం పై ఉండే నల్ల మచ్చల దగ్గర నుంచి మొటిమలు.. ఇలా అన్ని సమస్యలను తగ్గిస్తుంది.

Latest Videos

click me!