యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) అనేది మహిళలను ప్రభావితం చేసే ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ సమస్య మొత్తం మహిళల్లో 25% మందిని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ సమస్యను ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు. అయితే ఇది అంత ప్రమాదకరమేమీ కాదు. కానీ దీనివల్ల ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలన్న కోరిక పుడుతుంది. దీనివల్ల తరచుగా మూత్రం వస్తుంది. అది కూడా కొద్దికొద్దిగా. ఈ మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రం ఘాటు వాసన, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే యుటిఐ ఉన్నవారు యాంటీ బయాటిక్స్ ను వాడుతారు. ఈ యాంటీ బయాటిక్స్ ఈ సమస్య పెరగకుండా ఆపుతాయి.
యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా సంక్రమణకు చికిత్స చేయడానికి సహాయపడగలిగినప్పటికీ.. వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. యుటిఐ సమస్యను తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ ను వాడటం వల్ల దద్దుర్లు, మైకము, వికారం, విరేచనాలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయని సీడీసీ హెచ్చరిస్తోంది. అంతేకాదు యాంటీబయాటిక్-రెసిస్టెంట్ యుటిఐ అభివృద్ధి చెందే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
urinary tract infection
నీటిని పుష్కలంగా తాగాలి
ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. అయితే వాటర్ యుటీఐని నివారించడానికి, చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది. వాటర్ మూత్రాన్ని పల్చగా చేస్తుంది. అంతేకాదు ఎక్కువ సార్లు మూత్రమూసర్జన అయ్యేలా చేసి సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
urinary infection
క్రాన్ బెర్రీలు
దీనిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. కొన్ని అధ్యయనాలు మాత్రం తియ్యని క్రాన్బెర్రీ రసం, క్రాన్బెర్రీ సప్లిమెంట్స్ లేదా ఎండిన క్రాన్బెర్రీస్ లు యుటీఐల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. క్రాన్బెర్రీస్ లో పీఏసీలు ఉండటమే దీనికి కారణం. ఇది మీ మూత్ర మార్గం పొరకు బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తుంది.
urinary infection
ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్స్ మన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. యుటీఐలను పూర్తిగా తగ్గించడానికి, నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఎందుకంటే అవి హానికరమైన బ్యాక్టీరియాను సహాయక బ్యాక్టీరియాతో భర్తీ చేస్తాయి.
Urinary Infection
విటమిన్ సి
విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. విటమిన్ సి అనారోగ్యాలను నివారించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి మీ మూత్రాన్ని మరింత ఆమ్లంగా మారుస్తుంది. ఇది యుటీఐలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండు, కివి, రెడ్ బెల్ పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
మూత్రాన్ని ఆపకూడదు
యుటీఐ సమస్య ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితిలో మూత్రాన్ని పట్టి ఉంచకూడదు. మూత్రం పోయడంలో అసౌకర్యంగా అనిపించినప్పటికీ.. అవసరమైనప్పుడు మీరు ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలి. మూత్రాన్ని ఆపితే బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే సంక్రమణను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే మీ మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ ఉండండి.