మనలో ప్రతి ఒక్కరూ ఏ వస్తువును కొన్నా బేరం ఖచ్చితంగా ఆడుతుంటారు. 50 చెప్పిన దగ్గర 20, 25 రూపాయలు అడుగుతుంటారు. కానీ అమ్మే వ్యక్తి మాత్రం కొన్ని కొన్ని సార్లు అసలే రాదని నిర్మొహమాటంగా చేప్పేస్తుంటారు. ఆన్ లైన్ లో బేరం ఆడటానికి అస్సలు ఛాన్సే లేదు. కానీ ఆఫ్ లైన్ లో మాత్రం బేరం ఖచ్చితంగా ఆడొచ్చు. మీరు తక్కువ ధరకే కొనాలంటే మాత్రం కొన్ని ట్రిక్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాలి.
షాపింగ్ చేసేటప్పుడు డబ్బు ఆదా చేయాలంటే బేరసారాలు ఎలా చేయాలో తెలుసుకోవాలి. మామూలుగా మన అమ్మలు, అమ్మమ్మలు అలా చేయడం మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బేరసారాలు చేయాలంటే చాలా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు బేరసారాలు చేయడానికి కొన్ని ట్రిక్స్ ను తెలుసుకుందాం పదండి.
తక్కువ ఆసక్తి చూపించండి
మీకు ఒక వస్తువు ఎంత నచ్చినా.. దాన్ని అమ్మేవాడికి మాత్రం చెప్పకండి. గట్టిగా మీ పక్కన వాళ్లకు కూడా చెప్పండి. ఎందుకంటే మీ ఇష్టాన్ని దుకాణదారుడు పసిగట్టి దాన్ని ఎక్కువ రేటుకే మీకు అమ్మేప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీకు ఇష్టమైన వస్తువును ఎంత ధరకైనా కొంటారని వారికి తెలుసు. కాబట్టి తక్కువ దొరికే వేరే చోట కొంటామాని మొదటి నుంచి చూపించాలి. ఇలా చేయడం వల్ల మీరు దుకాణదారుతో సులభంగా సంప్రదింపులు జరపగలుగుతారు. మీకు నచ్చిన వస్తువును తక్కువ ధరకే కొంటారు.
ధరను పోల్చాలి
ఏదైనా కొనే ముందు నాణ్యత, ధరను బట్టి వాటిని పోల్చుకోవాలి. ఇందుకోసం దగ్గర్లోని వేరే షాపులకు వెళ్లి మీరు కొనాలనుకుంటున్న వస్తువుల ధరలను అడిగి తెలుసుకుని వాటిని పోల్చి చూడండి. ఇందుకోసం ఓ ఐదారు షాపులు తిరగండి. ఇలా చేయడం వల్ల నాణ్యతతో పాటు సరైన ధరల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ విధంగా మీరు సరైన దుకాణాదారుతో బేరసారాలు చేయగలుగుతారు. అలాగే మీకు నచ్చిన వస్తువులను కొంటారు.
మార్కెట్ గురించి తెలుసుకోండి
ఒక ప్లేస్ లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా ఆ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఎక్కువగా విండో లేదా స్ట్రీట్ షాపింగ్ లో మాత్రమే బేరసారాలు చేయొచ్చు.