బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

First Published | Oct 26, 2024, 10:21 AM IST

ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ల బుగ్గలపై నల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. కానీ ఈ మచ్చలు ఏం చేసినా పోవు. రకరకాల క్రీములను కూడా వాడుతుంటారు. ఇవి వాడినన్ని రోజులు మచ్చలు పోయినా,  వీటిని వాడటం మానేసిన వెంటనే ప్రత్యేక్షమవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే వీటిని శాశ్వతంగా పోగొట్టొచ్చు. 

dark spots

ఆడవాళ్లు ముఖ అందం విషయంలో ఎక్కడా తగ్గరు. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ముఖ అందం దెబ్బతింటుంది. ముఖ్యంగా ముఖంపై చెమట పట్టడం వల్ల చర్మం జిడ్డుగా అవుతుంది. దీంతో ముఖంలోని కొన్ని భాగాల్లో మొటిమలు అవుతాయి. పిగ్మెంటేషన్ వంటి సమస్యలూ వస్తాయి. 

dark spots

ముఖ్యంగా బుగ్గపై మృతకణాలు పేరుకుపోవడం వల్ల బుగ్గలు మాత్రమే నల్లగా కనిపిస్తుంటాయి. కానీ ఇది ముఖ అందాన్ని తగ్గిస్తుంది. బుగ్గలపై ఉన్న నలుపు ముఖ అందాన్ని పాడు చేస్తుంది. అందుకే ఆడవాళ్లు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను కొని చెంపలకు పెడుతుంటారు.

అయినా వీటివల్ల ఈ నల్ల మచ్చలు శాశ్వతంగా పోనేపోవు. అయితే మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మాత్రం బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

డార్క్ స్పాట్స్ తొలగించే హోం రెమెడీస్

దాల్చిన చెక్క, పసుపు, రోజ్ వాటర్

దాల్చిన చెక్క, పసుపు, రోజ్ వాటర్ తో మీరు చాలా సులువుగా చెంపలపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టొచ్చు. ఇందుకోసం అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొంచెం పసుపు, రోజ్ వాటర్ ను పోసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను చెంపలకు ఉన్న నల్ల మచ్చలపై అప్లై చేసి 2-3 నిముషాలు మసాజ్ చేయండి.

ఇది పూర్తిగా ఆరిన తర్వాత బుగ్గలను శుభ్రంగా కడగండి. ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు చేస్తే నల్ల మచ్చలు కనిపించకుండా పోతాయి. అలాగే మీ బుగ్గలు అందంగా మారతాయి. 
 


శెనగపిండి

శెనగపిండి కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. శెనగపిండి  మంచి ఎక్స్ఫోలియేటర్ కూడా సహాయపడుతుంది. ఒక చెంచా శెనగపిండిలో  ఒక చెంచా పాలు, ఒక చెంచా రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ చేయండి.  

కావాలనుకుంటే వీటికి బదులుగా నార్మల్ వాటర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఈ మూడింటిని మిక్స్ చేసి పేస్ట్ లా చేసి దానితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన కణాలు తొలగిపోతాయి. 
 

dark spots


కాఫీ పౌడర్

బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి కాఫీ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ స్క్రబ్ ను తయారు చేయడం చాలా సులువు. ఇందుకోసం కాఫీ, పాలు, తేనె అవసరమవుతాయి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు, అర టీస్పూన్ తేనెను వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టండి. ఇది ముఖానికి అంటుకున్న మురికిని పోగొడుతుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది.
 

dark spots

ఆలుగడ్డ

ఆలుగడ్డ కూడా బుగ్గలపై, ముఖంపై ఉన్న నల్ల మచ్చలను చాలా సులువుగా పోగొడుతుంది. ఇందుకోసం ఒక చిన్న బంగాళాదుంపను  తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. దీని గుజ్జును బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలపై రుద్దండి. దీని వల్ల నోటి చుట్టూ ఉన్న చర్మం బిగుతుగా మారుతుంది.

ఇలా చేయడం వల్ల బంగాళాదుంప రసం చర్మ రంధ్రాల్లోకి బాగా చొచ్చుకుపోయి మెలనిన్ ఉత్పత్తిని ఆపుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగి అలోవెరా జెల్ అప్లై చేయండి.
 

పసుపు

పసుపును ముఖాన్ని అందంగా చేయడానికి, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. అందుకే పసుపు నల్ల మచ్చలను పూర్తిగా పోగొట్టడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇందుకోసం పసుపులో పాలను కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని బుగ్గకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత బుగ్గను బాగా శుభ్రం కడిగితే సరిపోతుంది. 
 

dark spots

పచ్చి పాలు

పచ్చి పాలు కూడా బుగ్గలపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పచ్చిపాలు చర్మంలో పిగ్మెంటేషన్ సమస్యను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో తేనెను కలపండి.

ఈ మిశ్రమంతో బుగ్గలను మెత్తగా రుద్దండి. స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని క్లీన్ చేయండి. ఆకుపచ్చ పాలలో ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలుంటాయి. ఇది చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. 
 

Latest Videos

click me!