ఆడవాళ్ల అందమైన చేతులను గోరింటాకు మరింత అందంగా మార్చేస్తుంది. అందుకే ఆడవాళ్లు వీలైనప్పుడల్లా చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటుంటారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్క మహిళా గోరింటాకును పెట్టుకోవడాన్ని ఇష్టపడుతుంది. అయితే చేతుల అందం కోసమే మెహందీని పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు.
కానీ మెహందీ ఆడవాళ్ల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది కేలవం అందం కోసమే కాదు.. అంతకు మంచి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు చేతులకు మెహందీని పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేడిని తగ్గిస్తుంది
చాలా మంది ఆడవాళ్ల ఒంట్లో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ వేడిని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించడంలో గోరింటాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అవును గోరింటాకులో శీతలీకరణ ప్రభావం ఉంటుంది. ఈ గోరింటాకును చేతులకు రాసుకుంటే శరీరంలోని వేడి చాలా వరకు తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.
ఇన్ఫెక్షన్లను నివారించడంలో గోరింటాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది మన గోళ్లలో దాగున్న బ్యాక్టీరియాను చంపుతుంది. మనల్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడటానికి సహాయపడుతుంది.
నొప్పి, వాపు తగ్గుతాయి
మీకు తెలుసా? హెన్నా నేచురల్ పెయిన్ రిలీవర్ గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే చేతులకు గోరింటాకును పెట్టుకోవడం వల్ల చేతుల్లో నొప్పి, వాపు చాలా వరకు తగ్గుతాయి. పొప్పిని తగ్గించుకోవడానికి కూడా మీరు వీటిని ఉపయోగించొచ్చు.
గోళ్లను బలంగా చేస్తుంది
గోరింటాకులో కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చేతి గోర్లను బలంగా చేస్తుంది. అలాగే గోర్లు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా బాగా సహాయపడుతుంది. బలహీనమైన గోర్లు ఉన్నవారికి గోరింటాకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
పాలిషింగ్ చేతులు
చేతులకు గోరింటాకును పెట్టుకోవడం వల్ల మన చర్మం కింద ఉన్న ప్రాంతంలో రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. దీనివల్ల మీ చేతులపై ముడతలు తగ్గిపోతాయి.
అలాగే మీ చేతులు అందంగా, యవ్వనంగా కనిపిస్తాయి. ఇకపోతే గోరింటాకు వాసన, రంగు రెండూ కామోద్దీపన అని నమ్ముతారు. భారతీయ వివాహాలలో వధువుకు మెహందీ పెట్టడానికి ఇది కూడా ఒక కారణమే.