రూపాయి ఖర్చు చేయకుండా గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేయండి

First Published | Oct 25, 2024, 10:09 AM IST

ఇక ఇప్పటి నుంచి పండుగలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దీంతో ఇంటిని ఎక్కువగా శుభ్రం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వంటింట్లో ఉండే గ్యాస్ స్టవ్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే శుభ్రంగా ఉంటుంది. 

కొన్నేండ్ల కిందట కట్టెల పొయ్యి మీదే మొత్తం వంటను చేసేవారు. ఇప్పుడు ఎలాంటి పొగరాని గ్యాస్ స్టవ్ లపై వంట చేస్తున్నారు. గ్యాస్ స్టవ్ పై వంట సులువుగా, తొందరగా అయిపోతుంది. కానీ స్టవ్ పై పాలు పొంగడం, పప్పులు, కూరలు, నూనెలె ఒలికిపోవడం వంటివి తరచుగా జరుగుతాయి. దీనివల్ల స్టవ్ మురికిగా మారుతుంది. 
 


స్టవ్ పై పడిన నూనె, కూరలు వాటిపై మొండి మరకలను కలిగిస్తాయి. వీటిని వారం రోజుల్లోపు క్లీన్ చేయలేదంటే అస్సలు పోవు. దీనివల్ల ఎంత కొత్త స్టవ్ అయినా సరే పాతవాటిలా కనిపిస్తాయి. అందుకే స్టవ్ కు అంటుకున్న మొండి మరకలను రూపాయి ఖర్చు లేకుండా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గ్యాస్ స్టవ్, గ్యాస్ బర్నర్

మీరెంత బిజీగా ఉన్నా సరే మీరు ప్రతిరోజూ ఉపయోగించే ప్రతి వస్తువునూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ ను. ఎందుకంటే ప్రతిరోజూ దీనిపై వంటచేస్తుంటాం. దీంతో దానిపై నూనె, కూరలు, పాలు వంటివి ఒలికిపోయే అవకాశం ఉంది. సమయం లేదని గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయడం మర్చిపోతే మాత్రం ఎంత మురికిగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

స్టవ్ పై పడిన మరకలను పోగొట్టడానికి ఆడవాళ్లు గంటలకు గంటలు కష్టపడుతుంటారు. అయినా అది సరిగ్గా క్లీన్ కాదు. కానీ టిప్స్ ను ఫాలో అయితే మాత్రం మీరు కష్టపడకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎంచక్కా క్లీన్ చేయొచ్చు. 


ప్రతిరోజూ వంట చేస్తారు కాబట్టి గ్యాస్ స్టవ్ బర్నర్ ను కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ బర్నర్ కు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచే బయటకు మంట వస్తుంది. అయితే ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల ఆ రంధ్రాల్లో నూనెతో మురికి పేరుకుపోతుంది. దీంతో స్టవ్ సరిగ్గా మండదు. ఇది గ్యాస్ ఎక్కువ అయిపోయేలా చేస్తుంది. అందుకే మీరు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటే గ్యాస్ ఎక్కువ ఆదా అవుతుంది. ఇందుకోసం గ్యాస్ స్టవ్ ను, బర్నర్లను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఉల్లిపాయ

అవును ఉల్లిపాయతో కూడా మీరు గ్యాస్ స్టవ్ ను ఎంచక్కా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఉల్లిపాయ ముక్కలను నీటిలో 20 నిమిషాల పాటు మరిగించండి. ఈ నీరు పూర్తిగా చల్లబడిన తర్వాత దాంట్లో స్క్రబ్ లేదా స్పాంజ్ ని ముంచి బర్నర్, గ్యాస్ స్టవ్ మీద మచ్చలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అక్కడ స్క్రబ్ చేయండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజంగా మరకలను పోగొట్టడానికి ఇది చాలా సులువైన పద్దతి. 
 


వైట్ వెనిగర్

వైట్ వెనిగర్ కూడా గ్యాస్ స్టవ్ ను కొత్తదానిలా మెరిపించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలోని అధిక ఆమ్లత వల్ల ఓవెన్ టాప్ మరకలను తక్కువ టైంలోనే సులువుగా పోగొడుతుంది. అంతేకాదు స్టవ్ రంగు దాని అసలు రంగుకు వస్తుంది. ఇందుకోసం సగం బకెట్ నీళ్లలో రెండు చెంచాల వైట్ వెనిగర్ ను వేసి స్క్రబ్ లేదా స్పాంజ్ లో ముంచి మరకలపై రుద్ది క్లీన్ చేయండి. ఇలా మీరు వారానికి రెండు సార్లు క్లీన్ చేస్తే మరకలు చాలా సులువుగా పోతాయి. 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా స్టవ్ ను చాలా సింపుల్ గా, తొందరగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు చెంచాల బేకింగ్ సోడాను తీసుకుని అందుల నిమ్మరసం లేదా వెనిగర్ ను మిక్స్ చేయండి. దీనితో గ్యాస్ స్టవ్, బర్నర్లను శుభ్రం చేయండి. 

ఇందుకోసం ఒక టీస్పూన్ బేకింగ్  సోడాను తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోయండి. దీన్ని గాజు గ్యాస్ ఓవెన్ పై స్ప్రే చేయండి. అలాగే ఆయిల్ మరకలు బాగా ఉన్న చోట స్క్రబ్ లేదా స్పాంజ్ తో స్క్రబ్ చేయండి,. అలాగే సగం నిమ్మరసాన్ని బాగా పిండి శుభ్రం చేయండి. ఆ తర్వాత నీళ్లతో స్టవ్ ను క్లీన్ చేయండి. 

ఉప్పు, బేకింగ్ సోడా

ఉప్పుకు మీరు ప్రత్యేకించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉంటుంది. కాబట్టి ఉప్పు, బేకింగ్ సోడాను ఉపయోగించి స్టవ్ ను నీట్ గా చేయండి. ఇందుకోసం ఉప్పును, బేకింగ్ సోడాను సమానపరిమాణంలో కలపండి. ఆ తర్వాత దీనిలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను గ్యాస్ స్టవ్ కు అప్లై చేసి క్లీన్ చేయండి. దీంతో స్టవ్ పై ఒక్క మరక కూడా లేకుండా పోతాయి. 

Latest Videos

click me!