ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఫ్యామిలీ, ఆఫీసు ఒత్తిడి, కెమికల్స్ షాంపూల వాడకం, దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. వీటివల్ల జుట్టు విపరీతంగా రాలడమే కాకుండా.. నెత్తిమీద చుండ్రు కూడా వస్తుంది. ఈ చుండ్రు జుట్టు బాగా రాలేలా చేస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉంటాయని మార్కెట్ లో రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి.