మజ్జిగలో తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది..?

First Published | Aug 28, 2024, 11:23 AM IST

 మజ్జిగలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా? దాని వల్ల... మన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దాం..

ఆరోగ్యాన్ని కాపాడటంలో మజ్జిగ చాలా బాగా సహాయం చేస్తుంది.  ఇదే మజ్జిగ మీ అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా? ముఖానికి మజ్జిగ రాయడం వల్ల.. మీ చర్మం మరింత మెరుస్తూ కనపడుతుంది. మరి.. అదే మజ్జిగలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా? దాని వల్ల... మన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దాం..
 

మజ్జిగలో సహజంగా నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. అంతేకాదు ప్రోబయోటిక్ లాక్టిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. అందుకే.. మజ్జిగలో కొంచెం తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి.
 


ఇలా చేయడం వల్ల... మీ చర్మం అందంగా, యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది. మొటిమల దగ్గర నుంచి, బ్లాక్ హెడ్స్ వరకు.. ఎలాంటి సమస్యలు ఉన్నా  తగ్గిపోవడం మొదలుపెడతాయి. మొటిమల తగ్గిపోయినా.. వాటి తాలుకా మచ్చలు మాత్రం అలానే ఉంటాయి. ఆ మచ్చలను  ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ముఖానికి సహజంగా గ్లో తీసుకువస్తుంది.

డ్రై స్కిన్ సమస్య ఉన్నవారు అయినా దీనిని ప్రయత్నించవచ్చు.  ఇలా చేయడం వల్ల ఇక మీకు డ్రై స్కిన్ ప్రాబ్లం ఉండదు. చర్మం చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుంది. చాలా మృదువుగా కూడా ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా ఉండదు. చర్మాన్ని హైడ్రేటింగ్  గా ఉంచడానికి సహాయం చేస్తుంది. మరి.. దీనిని ముఖానికి ఎలా అప్లై చేయాలో  చూద్దాం..
 

glowing skin

ఒక స్పూన్ తేనె తీసుకొని.. అందులో ఒక స్పూన్ మజ్జిగ వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి రాసి.. 20 నిమిషాలపాటు అలానే వదిలేయాలి.  ఆ తర్వాత.. ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది.

Latest Videos

click me!