Pregnancy: గర్భిణీ స్త్రీలు.. గసగసాలు తీసుకోకూడదా..?

First Published | Nov 19, 2021, 3:38 PM IST

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శిశువు ఎదుగుదలకు ముఖ్యంగా పోషకాలు అవసరం, కాబట్టి గసగసాలు తినవచ్చు,  అయితే.. ఎక్కువ పరిమాణంలో మాత్రం తీసుకోకకూడదట.
 


చాలా రకాల వంటలకు రుచి తేవడానికి అందుల్లో గసగసాలను వాడుతుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్, మసాలా వంటల్లో దాని వాడకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రుచి మాత్రమే కాదు..  ఆరోగ్యం కూడా లభిస్తుంది. దని వల్ల అనే ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. ఈ గసగసాలను గర్భిణీ స్త్రీలు మాత్రం తీసుకోకూడదని చాలా మంది భావిస్తుంటారు. ఇవి తినడం వల్ల వారి ఆరోగ్యానికి ముప్పు తీసుకువస్తుందని  చాలా మంది అంటూ ఉంటారు.

గర్భధారణ సమయంలో గసగసాలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల హాని కలుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే, నిపుణులు దీనిని నమ్మ వద్దని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శిశువు ఎదుగుదలకు ముఖ్యంగా పోషకాలు అవసరం, కాబట్టి గసగసాలు తినవచ్చు,  అయితే.. ఎక్కువ పరిమాణంలో మాత్రం తీసుకోకకూడదట.

Latest Videos


గసగసాల ప్రయోజనాలు : గసగసాల నుండి నూనె కూడా తీస్తారు. దీనిని  అనేక వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉపయోగిస్తారు. గసగసాలలో లభించే ఫైటోకెమికల్స్‌లో ఒమేగా-6, ఫైబర్, ప్రొటీన్, థైమిన్, విటమిన్ బి, మాంగనీస్  కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

గర్భధారణ సమయంలో దీనిని తీసుకోవడం వల్ల 50% ముఖ్యమైన నూనెలు , కొవ్వులు  శరీరానికి అందుతాయి. ఇవి గర్భిణీ స్త్రీ , పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.

poppy seeds drink

గసగసాలలో ఒలీక్ ,లినోలెయిక్ యాసిడ్, ఒక రకమైన అసంతృప్త కొవ్వు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచడానికి..చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా  సహాయం చేస్తుంది.

గసగసాల వినియోగం గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గర్భధారణ తరచుగా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గసగసాలలో ఫైబర్ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

poppy seeds drink

గసగసాలలో కాల్షియం , మెగ్నీషియం కూడా ఉంటాయి. ఈ రెండు పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. అదనంగా, గసగసాలలో ఫోలిక్ యాసిడ్ , నియాసిన్ వంటి అంశాలు ఉన్నాయి, ఇవి గర్భిణీ స్త్రీలకు శక్తినిస్తాయి. 

poppy seeds drink

గసగసాలలో కోడైన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల హాని కలుగుతుంది. గసగసాలలో పిల్లలకు ,తల్లులకు హాని కలిగించే కొన్ని విషాలు ఉంటాయి. కాబట్టి.. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే..  మాత్రం.. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయి. 

click me!