టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు దక్షిణాదిన స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉంది. అయితే, ఇటవలే అన్నింటికీ బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది.త్వరలోనే ఆమె తన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, ఆలోపు ఆమె తన ఖుషీ మూవీపై ఫోకస్ పెట్టింది.