బాడీకి పర్ఫెక్ట్ షేప్ ఇవ్వాలంటే విద్యాబాలన్ లా ఇలాంటి బ్లాక్ డ్రెస్సులను ట్రై చేయండి

First Published | Dec 31, 2023, 10:32 AM IST

Fashion Tips: స్టైలిష్ గా కనిపించాలంటే బాడీ షేప్ ను బట్టి దుస్తులు వేసుకోవాలి. అప్పుడే లుక్ బాగుండటంతో పాటుగా అందంగా కూడా కనిపిస్తారు. ఇందుకోసం లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. 

మనలో ప్రతి ఒక్కరూ స్టైలిష్ గా కనిపించడానికే ఇష్టపడతాం. అలాగే ఇందుకోసం మన రూపాన్ని అనేక విధాలుగా మార్చడానికి ట్రై చేస్తుంటారు. ఒకప్పటిలా కాకుండా.. ప్రస్తుతం చాలా మంది ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది నలుపు రంగు దుస్తులనే ఎక్కువగా ఇఫ్టపడుతున్నారు. ఈ బ్లాక్ కలర్ చీర, డ్రెస్సు వంటి వాటిలో మీరు బలే అందంగా కనిపిస్తారు. అలాగే వీటిలో మీరు స్టైలీష్ గా కూడా కనిపిస్తారు. 

Vidya Balan

స్టైలిష్ లుక్ కోసం తరచూ సెలబ్రిటీల లుక్స్ ను రీక్రియేట్ చేస్తుంటాం.  హీరోయిన్ విద్యాబాలన్ వేసుకున్న బ్లాక్ కలర్ లుక్స్ కూడా బాగా నచ్చుతాయి. ఎందుకంటే వీటిలో ఆమె అందం బాగా పెరిగిపోయింది. కాబట్టి మీ శరీరానికి పర్ఫెక్ట్ లుక్కునిచ్చే విద్యాబాలన్ ధరించిన బ్లాక్ కలర్ దుస్తులను ఈ రోజు చూసేద్దాం పదండి. 
 


ఫ్లోర్ లెంగ్త్ సూట్ 

ఇది లుక్ లో చాలా స్టైలిష్ లుక్కునివ్వడానికి ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ అందమైన లుక్ ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ లో విద్యాబాలన్ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది కదూ.  అయితే మార్కెట్ లో ఈ తరహా దుస్తులు కేవలం రూ.2500 వరకు  సులభంగా లభిస్తాయి. ఈ రకమైన లుక్ లో మీరు మంచి హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయండి. 
 

Vidya balan

స్లిట్ కట్ డ్రెస్

కాక్టెయిల్ నైట్ కోసం ఈ రకమైన కట్ అవుట్, స్లిట్ కట్ దుస్తులు చాలా క్లాసీ లుక్ ను ఇవ్వడానికి సహాయపడతాయి. వీటిలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. శాటిన్ ఫ్యాబ్రిక్ లో ఈ డ్రెస్ ను మీరు 1500 రూపాయల వరకు కొనొచ్చు.  ఈ రకమైన డ్రెస్సుల్లో మీరు ఎరుపు రంగు లిప్ స్టిక్ ను వాడితే మీ అందానికి వంక ఎవరూ పెట్టరు. 
 

బ్లాక్ చీర 

ప్రతి ఫంక్షన్ లో బోర్డర్ వర్క్ చీరను కట్టుకోవడానికి ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ చీర మీకు మంచి రిచ్ లుక్ ను ఇస్తుంది. అలాగే ఫంక్షన్ లో మీకు స్పెషల్ లుక్ ను కూడా ఇస్తుంది. మీరు ఈ రకమైన చీరను రూ .2000 వరకు సులభంగా కొనొచ్చు. ఈ రకమైన లుక్ తో మీర ఆకుపచ్చ రంగు ఆభరణాలను ధరిస్తే అదిరిపోతారు. 

Latest Videos

click me!