పన్నగా నాజుకుగా ఉండాలనే కరిక చాలా మందిలో ఉంటుంది. కానీ.. అది అందరికీ సాధ్యం కాదు. అయితే.. బొద్దుగా ఉన్నామని.. చాలా మంది చాల రకాల డ్రెస్ లు వేసుకోలేరు. ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా కనపడతాం అనే ఐడియా లేక.. తమకు నచ్చినట్లు ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. మీరు బొద్దుగా ఉన్నా కూడా... కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటే మీరు కూడా సన్నగా కనపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
చుడీదార్లు అందరూ వేసుకుంటారు. అలా కాకుండా,..అప్పుడప్పుడు మెడ్రన్ గా మిడ్డీలు లాంటివి వేసుకోవాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. కానీ.. సన్నగా ఉన్నవారికి బాగుంటుంది కానీ.. మాకు బాగోదు అని అనుకుంటారు. అయితే.. బొద్దుగా ఉన్నవారు కూడా మిడ్డీ వేసుకోవచ్చు. కానీ.. మిడి పూర్తి పొడవు ఉండకూడదు. కాస్త పొడవు తక్కువగా ఉండాలి. మీరు పొట్టి మిడి ధరించినప్పుడు, మీ శరీరం కొద్దిగా సన్నగా కనిపిస్తుంది.
చబ్బీ గా ఉన్న అమ్మాయిలు చాలా బిగుతుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండాలి. బిగుతుగా ఉండే దుస్తులు మీ కండగల శరీరాన్ని బహిర్గతం చేస్తాయి. సరైన పరిమాణంలో స్లిమ్ ఫిట్ జీన్స్ ధరించండి. ఆ జీన్స్‌కు సరిపోయేలా సరైన పరిమాణంలో హీల్స్ ధరించడం కూడా ముఖ్యం. కొంచెం ఎత్తుగా ఉండే బూట్లు ధరించడం వల్ల మీ శరీరం నాజూగ్గా కనిపిస్తుంది.
పైన పేర్కొన్నవి కాకుండా, లోదుస్తులను ఎంచుకోవడం కూడా ముఖ్యం. బ్రాను కొనుగోలు చేసేటప్పుడు, మీ శరీర ఆకృతికి అనుగుణంగా సరైన పరిమాణం, ఫిట్‌ను పొందడం ముఖ్యం. లేకుంటే.. ఎలాంటి డ్రెస్ వేసినా కూడా సరిగా కనిపించరు.
చక్కని ముదురు ఎరుపు, నలుపు రంగులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నడుము పైన ప్యాంటు వేసుకునే బదులు, నడుము క్రింద, నాభి ప్రాంతం వద్ద ప్యాంటు వేసుకోవడం వల్ల కాస్త లిఫ్ట్ వస్తుంది.
చుడీదార్లు, టాప్స్ మొదలైనవి చారల డిజైన్లతో ఉన్నప్పుడు, నిలువు గీతలు ఉన్న దుస్తులను ధరించండి. అవి శరీరాన్ని నాజూగ్గా కనిపించేలా చేస్తాయి. అడ్డగీతలు ఉన్నవి వేసుకుంటే.. మరింత లావుగా కనపడతారు.