జుట్టుకు పెరుగు పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 15, 2024, 10:50 AM IST

మనలో చాలా మంది పెరుగును కేవలం తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ దీన్ని జుట్టుకు కూడా పెట్టొచ్చు. అవును పెరుగును జుట్టుకు పెట్టడం వల్ల ఎన్నో హెయిర్ సమస్యలు తగ్గిపోతాయి తెలుసా. 
 

పెరుగు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీన్ని ఒక్క ఎండాకాలంలోనే కాకుండా, చలికాలం, వానాకాలంలో  కూడా తినొచ్చు. ఎందుకంటే పెరుగులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే పెరుగు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తుందో, మన జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. అవును దీన్ని ఉపయోగించి మనం ఎన్నో రకాల జుట్టు సమస్యలను నయం చేసుకోవచ్చు. పెరుగులోని లక్షణాలు మన జుట్టు ఫాస్ట్ గా పెరగడానికి సహాయపడటంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు పెరుగును జుట్టుకు పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


చుండ్రు మాయం..

చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. నిజానికి నెత్తిమీద చుండ్రు ఉంటే వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి. అలాగే జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. అయితే పెరుగు సమస్యకు చెక్ పెట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అవును పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తరచుగా జుట్టుకు పెరుగును పెడితే చుండ్రు లేకుండా పోతుంది. 


జుట్టు మృదువుగా అవుతుంది

చాలా మందికి జుట్టు రఫ్ గా ఉంటుంది. ఏం చేసినా.. జుట్టు మాత్రం సాఫ్ట్ గా కాదు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. అవును పెరుగును జుట్టుకు అప్లై చేస్తే మీ జుట్టు మృదువుగా అవుతుంది. అలాగే జుట్టు చిక్కులు కూడా ఎక్కువగా పడవు. 

జుట్టు పెరుగుతుంది

జుట్టు పొడుగ్గా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చాలా చాలామందికి పొట్టి జుట్టే ఉంటుంది. అయితే జుట్టు పెరగడానికి పెరుగు మీకు సహాయపడుతుంది. అవును పెరుగులో జుట్టును పెంచే లక్షనాలు ఉంటాయి. పెరుగుతో జుట్టు ఫాస్ట్ గా పెరగడంతో పాటుగా నెత్తి కూడా బలంగా ఉంటుంది. 


జుట్టు బలం

జుట్టు బలంగా ఉంటేనే వెంట్రుకలు ఊడిపోవు. లేదంటే వెంట్రుకలు బాగా ఊడిపోతాయి. అయితే పెరుగు మన జుట్టును బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. పెరుగు జుట్టును మూలాల నుంచి బలంగా చేయడానికి బాగా సహాయపడుతుంది. 


జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

హెయిర్ ఫాల్ సమస్య చాలా మందికి ఉంటుంది. ఇది తగ్గడానికి రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. కానీ మీరు పెరుగుతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవును మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే పెరుగును ఉపయోగించండి. పెరుగు వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. 

కండీషనర్ గా పనిచేస్తుంది

అవును పెరుగు కూడా మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారదు. అలాగే చిక్కులు కూడా ఎక్కువగా పడదు. పెరుగు ఒక నేచురల్ కండీషనర్ లా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది.
 


పెరుగు ఎలా అప్లై చేయాలి 

జుట్టుకు పెరుగును అప్లై చేయడానికి .. ముందుగా 1 గుడ్డు ను తీసుకుని అందులో 2 టీస్పూన్ల పెరుగును వేసి కలపండి. ఈ రెండింటినీ పేస్ట్ లా చేయండి. దీన్ని జుట్టు మూలాలకు, చివరకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
 

Latest Videos

click me!