పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

First Published | May 2, 2023, 10:51 AM IST

ప్రతి మహిళా తమ పునరుత్పత్తి ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే లైంగిక వ్యాధులకు దూరంగా ఉంటారు. లేదంటే..? 
 

స్త్రీ జీవితంలో ఎన్నో దశలుంటాయి. పీరియడ్ ప్రారంభం నుంచి రొమ్ముల ఎదుగుదల, గర్భం, మెనోపాజ్ వంటి ఎన్నో దశలు ఉంటాయి. ఈ దశలన్నీ వాటి పునరుత్పత్తి అవయవాలు, వ్యవస్థలతో అనుసంధానించబడి ఉంటాయి. వీటన్నింటిపై వారికి సరైన అవగాహన లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వారి మొత్తం ఆరోగ్యం కోసం మహిళలు లైంగిక,  పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లైంగిక సంక్రమణ అంటువ్యాధుల  గురించి..

జనన నియంత్రణ, లైంగిక సంక్రమణ అంటువ్యాధులు (ఎస్టీఐ), రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మామోగ్రఫీ, రుతువిరతి, హార్మోన్ థెరపీతో పాటు గర్భధారణ, ప్రసవ పరిస్థితులు, పునరుత్పత్తి అవయవాల పనితీరును ప్రభావితం చేసే రోగ నిర్ధారణల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నింటి గురించి తెలుసుకుంటేనే ఆడవారు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. పునరుత్పత్తి గురించి ఆడవారు ఎలాంటి విషయాలను తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


పీరియడ్, ఫస్ట్ పీరియడ్, పీరియడ్స్ తిమ్మిరి

ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు వారికి తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తారు. ఇవి యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. యోనిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల యోని సంక్రమణకు దారితీస్తుంది. అలాగే యోనిని క్లీన్ చేయడానికి సబ్బు, సువాసన గల ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల యోని పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి యోని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే అమ్మాయిలకు కౌమారదశ నుంచే దీని గురించి అవగాహన కల్పించాలి. 
 

గర్భనిరోధక పద్ధతుల వాడకం 

లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం కోసమే కాదు ఆరోగ్యకరమైన, సురక్షితమైన సంబంధాల కోసం గర్భనిరోధక పద్దతుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. గర్భనిరోధక పద్ధతుల గురించి తెలుసుకోవడం వల్ల గర్భధారణ ఎప్పుడు తమకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందో మహిళలు నిర్ణయించుకోగలుగుతారు. గర్భనిరోధకాలు ప్లాన్ చేయని గర్భం నుంచి వారిని కాపాడుతుంది. 
 

hair fall

హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే వంధ్యత్వం

చాలా మంది ఆడవారికి హార్మోన్ల అసమతుల్యత గురించి తెలియకపోవడం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్ తో  ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. దీని వల్ల ముఖం, శరీరంపై వెంట్రుకలు రావడం మొదలవుతుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా పీరియడ్స్, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
 

లైంగిక సంక్రమణ వ్యాధులు

మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెక్స్ కూడా ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా అసురక్షిత శృంగారం లైంగిక సంక్రమణ వ్యాధులను కలిగిస్తుంది. ప్లాన్ చేయని గర్భం, గర్భస్రావం  ప్రమాదాల్ని కూడా పెంచుతుంది. 

premarital health checkup

పునరుత్పత్తి ఆరోగ్యం

ప్రీ-మెనోపాజ్ దశలో ఆడవారికి ఎన్నో సమస్యలు వస్తాయి. శారీరక ఆరోగ్యంతో పాటుగా మూడ్ స్వింగ్స్, ఒత్తిడి వంటి మానసిక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. 
 

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం

పునరుత్పత్తి వ్యవస్థపై అవగాహన ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. గర్భాశయ స్క్రీనింగ్, హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్, మామోగ్రామ్ మొదలైన వాటి గురించి తెలుసుకున్న తర్వాతే వారు తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోగలుగుతారు.

click me!