ట్యాబ్లెట్స్ తో పనిలేకుండా పీరియడ్ పెయిన్ తగ్గించేదెలా?

First Published | Apr 29, 2024, 3:23 PM IST

చాలా మంది పీరియడ్స్ నొప్పి తగ్గించుకునేందుకు  ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ.. ఆ ట్యాబ్లెట్స్  వేసుకోవడం ఆరోగ్యానికి  మంచిది కాదు. 

మహిళలకు పీరియడ్స్ లో ఎంత నొప్పిగా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. విపరీతమైన నొప్పి , కాళ్ల తిమ్మిరులు ఉంటాయి. ఆ సమయంలో ఏ పనీ చేయాలని అనిపించదు. మూడ్ స్వింగ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే... చాలా మంది పీరియడ్స్ నొప్పి తగ్గించుకునేందుకు  ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ.. ఆ ట్యాబ్లెట్స్  వేసుకోవడం ఆరోగ్యానికి  మంచిది కాదు. కానీ.. మరి ఈ నొప్పి తగ్గించుకోవడం ఎలా అనుకుంటున్నారా..? ఈ కింది చిట్కాలు ఫాలో అయితే... మీరు సులభంగా పీరియడ్ నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం..
 

periods

1.హీట్ థెరపీ..
హీట్ థెరపీ  సహాయంతో.. పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంట్లో హీట్ బ్యాగ్ ఉంటే.. దానిని పొట్ట దగ్గర పెట్టుకోవాలి. ఈ వేడి వల్ల పొట్ట దగ్గర నొప్పి తగ్గుతుంది.  అంతేకాదు.. వేడి నీటితో స్నానం చేసినా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.

Latest Videos


2.వ్యాయామం...
చాలా మంది పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయకూడదు అనుకుంటారు. కానీ... పీరియడ్స్ లో  వ్యాయామం చేయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామం చేయడం వల్ల రక్తం ఫ్లో పెరుగుతుంది. అవి ఎండోర్ఫిన్స్ విడుదల చేస్తాయి. అయితే కఠిన వ్యయామాలు కాకుండా.. ఎయిరోబిక్స్ లాంటివి చేయవచ్చు.

3.హెర్బల్ టీ..

హెర్బల్ టీ లు తాగడం వల్ల కూడా పీరియడ్స్ పెయిన్ నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. చమేలి టీ, అల్లం టీ, పెప్పర్మెంట్ టీ లాంటి  హెర్బల్ టీలను ప్రయత్నించాలి. ఈ టీ ల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి.. ఇవి.. మజిల్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

periods

4.డైట్ లో మార్పులు..
డైట్ లో మార్పులు చేసుకోవడం వల్ల కూడా  పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, వాల్ నట్స్, అవిశె గింజలు లాంటివి తీసుకోవాలి. అవి తినడం వల్ల  కూడా పీరియడ్స్ పెయిన్ తగ్గిపోతుంది.


5.మెగ్నీషియం సప్లిమెంటేషన్, ఆక్యుపెంచరీ..
మెగ్నీషియం  ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ పెయిన్ తగ్గించవచ్చు ఆక్యుపెంచరీ థెరపీ ని చేయించుకోవడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు.

6.రీలాక్సేషన్..
ఇక పీరియడ్స్ సమయంలో... రిలాక్సేషన్ పై ఫోకస్ పెట్టాలి. మెడిటేషన్్, బ్రీతింగ్ వ్యాయామాలు  చేయడం వల్ల కూడా.. సులభంగా ఈ పీరియడ్స్ పెయిన్ నుంచి బయటపడొచ్చు.

click me!