ఈ న్యూ ఇయర్ లో అందంగా మెరిసిపోవాలా..? ఇవి తినేయండి..!

First Published | Jan 3, 2022, 3:20 PM IST

 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల  అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి..? ఏవి తింటే.. మనం అందంగా మెరిసిపోవచ్చో ఇప్పుడు చూద్దాం..

మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టేశాం. ఈ న్యూ ఇయర్ లో మనం అందమైన చర్మంతో.. మరింత అందంగా కనిపించాలి అంటే.. ఆరోగ్యంగా కూడా ఉండాలి. 

 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల  అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి..? ఏవి తింటే.. మనం అందంగా మెరిసిపోవచ్చో ఇప్పుడు చూద్దాం..

Latest Videos


egg

1.కోడిగుడ్లు...

కోడి గుడ్డు లో కొన్ని పోషకాలు ఉన్నాయి, ఇవి చర్మాన్ని ఆహ్లాదకరంగా , ఆరోగ్యవంతంగా మార్చగలవు. అవి ప్రోటీన్లు, మల్టీవిటమిన్లు  లుటిన్లను కలిగి ఉంటాయి.  మల్టీవిటమిన్లు , లుటిన్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి, ప్రొటీన్ చర్మ కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, గుడ్లు తినడం వల్ల చర్మానికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. గుడ్లు అనేక రకాలుగా తీసుకోవచ్చు- గుడ్డు సలాడ్, ఆమ్లెట్, ఉడకబెట్టడం, లేదంటే పచ్చిగా అయినా తీసుకోవచ్చు. అలాగే, గుడ్డు పచ్చసొనను ఆహారంలో ఉపయోగించడం మర్చిపోవద్దు ఎందుకంటే అవి చర్మానికి తేమను అందించగల కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. మనమందరం కోరుకునే కాంతిని  గుడ్డు మనకు అందిస్తుంది.

2.డార్క్ చాక్లెట్
అద్భుతమైన చర్మ ప్రయోజనాలతో కూడిన రుచికరమైన వంటకం డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్‌లో రాగి, జింక్ , ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి డెత్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల సన్ డ్యామేజ్ తగ్గుతుంది.చర్మానికి మృదువైన ఆకృతిని అందిస్తుంది.

3.అవకాడో
ఈ పండులో విటమిన్ సి ,విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి, ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంలో  సహాయపడుతుంది. అవోకాడోలో ఉండే విటమిన్లు , కొవ్వులు చర్మాన్ని సరిచేయడంలో సహాయపడతాయి . మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇది ముడతలను తగ్గించడంలో , చర్మాన్ని మరింత అందంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
 

4.వాల్ నట్..
వాల్‌నట్స్‌లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది, ఇది ముడుతలను తగ్గించడంలో , చర్మానికి సమానమైన టోన్ ఇవ్వడంలో సహాయపడుతుంది

5.బాదంపప్పులు
డార్క్ స్పాట్స్ నుండి రక్షణ కావాలా? బాదంపప్పులను మీ ఆహారంలో చేర్చుకోండి, ఎందుకంటే వాటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇవి చర్మానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తాయి. చర్మం తేమగా.. ఊపిరిపీల్చుకునేలా చేస్తాయి.
 

6.జీడిపప్పు
విటమిన్ ఇ, సెలీనియం, జింక్‌తో నిండిన జీడిపప్పు ఆరోగ్యకరమైన , సంతోషకరమైన చర్మాన్ని సాధించడానికి మంచి మార్గం. సెలీనియం, విటమిన్ ఇ మంటను తగ్గించడంలో సహాయపడతాయి .జింక్ దెబ్బతిన్న చర్మ ప్రాంతాలను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.

7.పిస్తాపప్పులు
పిస్తాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మం యొక్క జిడ్డు ఆకృతిని నియంత్రిస్తాయి. చర్మం మరింత సున్నితంగా ఉండటానికి సహాయపడతాయి.

చియా గింజలు: చియా గింజలలో (Chia seeds) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చియా సీడ్స్
ఆహారంలో చియా సీడ్స్ లేకపోవడం వల్ల చర్మం పొడిబారడానికి దారి తీస్తుంది.  కాబట్టి.. చియా సీడ్స్ కచ్చితంగా తినాలి. చియా గింజలలో ఒమేగా-3 ఉంటుంది, ఇది చర్మానికి అవసరమైన పోషణను అందించడంలో సహాయపడుతుంది. మీరు మీ స్మూతీస్‌కు చియా విత్తనాలను జోడించవచ్చు. ఇవి మీ చర్మానికి మంచి తేజస్సు తీసుకువస్తాయి.

ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల పనితీరును మెరుగుపరిచి రక్తపోటును (Blood pressure) నియంత్రిస్తాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో చియా గింజలను చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
 

కివి: కివిలో (Kiwi) యాంటీబ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా మనం కివిని తీసుకోవడంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అందం పెంచడంలోనూ సహాయం చేస్తాయి.

వీటితో పాటు.. టమాటలు, కివీ పండ్లు, గ్రీన్ టీ లాంటివి తీసుకోవడం వల్ల కూడా.. మరింత ఉత్తేజంగా, చర్మం మృదువుగా.. అందంగా మెరిసేలా చేస్తాయి. ఈ ఆహారాలను కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. 

click me!