ಆದರೆ ಚಿಂತಿಸಬೇಡಿ! ನೀವು ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ನಿಮ್ಮ ಅಡುಗೆಮನೆಗೆ ಹೋಗಿ ಮತ್ತು ಕೆಲವು ಮನೆಮದ್ದುಗಳನ್ನು ತಯಾರಿಸಿ. ಆ ಮೂಲಕ ಕುತ್ತಿಗೆಯ ಕಪ್ಪು ಬಣ್ಣವನ್ನು ಮಾಯಮಾಡಿ...
నల్లని మెడను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు
కస్తూరి పసుపు ప్యాక్
మెడపై ఉన్న నలుపు రంగును వదిలించుకోవడానికి కస్తూరి పసుపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ముందుగా ఈ పసుపును మీడియం మంట మీద వేయించాలి. ఇది బంగారు రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా తేనె, పెరుగు, కాఫీ పొడి, నిమ్మరసం వేసి బాగా కలగలపండి.
అయితే ఈ ప్యాక్ ను ఉపయోగించే ముందు మీ మెడను నీట్ గా సబ్బు లేదా టమాటా చక్కెరతో స్క్రబ్ చేయాలి. దీనివల్ల మీ మెడ క్లీన్ అవుతుంది. ఇప్పుడు పసుపు ప్యాక్ ను మెడ చుట్టూ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా మీరు గనుక వారానికి 3 రోజులు చేస్తే మీ మెడ నలుపు పూర్తిగా తగ్గుతూ వస్తుంది.