కలబంద జెల్ లో మన శరీరానికి, చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ జెల్ ను అలాగే ముఖానికి పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కలబంద జెల్ లో టీ ట్రీ ఆయిల్ తో పాటుగా కొన్ని సహజ పదార్థాలను కలపకుండా ముడి కలబందను ముఖానికి ఉపయోగిస్తే కొన్ని చర్మ సమస్యలు వస్తాయి. ఇది చర్మ రకం, సున్నితత్వం మీద ఆధారపడి ఉంటుంది.
కొంతమందికి ముడి కలబందను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ కొంతమందికి అలెర్జీ, దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. నిజమేంటంటే? కలబంద ప్రతి చర్మ రకానికి సరిపోదు. కాబట్టి దీన్ని ఉపయోగించే ముందు ఇది పడుతుందా? లేదా? అని చెక్ చేసుకోవాలి.