Hair Care: ఎండాకాలం లో జుట్టు ఊడిపోతుందా? ఇలా చేయండి
ఎండాకాలంలో చాలా మందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అయితే.. అలా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
ఎండాకాలంలో చాలా మందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అయితే.. అలా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
వేసవిలో జుట్టు సంరక్షణ చిట్కాలు: ఒత్తైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఈ వేసవి కాలం మన చర్మాన్ని మాత్రమే కాదు, జుట్టును కూడా దెబ్బతీస్తుంది. మండే ఎండల వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో జుట్టుకు అదనపు శ్రద్ధ అవసరం. సూర్యరశ్మి, కాలుష్యం, దుమ్ము, ధూళి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. కాబట్టి వేసవిలో మండే ఎండల నుంచి జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
వేసవిలో మీ జుట్టు తీవ్రమైన సూర్యరశ్మి నుండి దెబ్బతినకుండా ఉండాలంటే, మీ జుట్టును టోపీ, రుమాలు లేదా స్టోల్తో కప్పండి.
జుట్టును శుభ్రంగా ఉంచండి:
వేసవిలో మీ జుట్టులో ఎక్కువ మురికి, చెమట చేరుతుంది. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాంటి పరిస్థితుల్లో జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా జిడ్డుగల జుట్టు ఉన్నవారు, ఎక్కువ చెమట పట్టేవారు తప్పనిసరిగా తమ తలను శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం అప్పుడప్పుడు తలస్నానం చేయవచ్చు.
తలకి షాంపూ వేసి స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా మీకు ఇష్టమైన ఏదైనా నూనెతో జుట్టును బాగా మసాజ్ చేయాలి. నూనెతో మసాజ్ చేసిన తర్వాత దాదాపు గంట తర్వాత తలకి షాంపూ వేసి స్నానం చేయాలి. ఒకవేళ మీ జుట్టు చాలా పొడిగా ఉంటే ముందు రోజు రాత్రి నూనెతో మసాజ్ చేసి మరుసటి రోజు షాంపూతో స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టుకు మంచి తేమ అందుతుంది.
మంచి షాంపూ, కండీషనర్:
వేసవి కాలమైనా కాకపోయినా జుట్టుకు మంచి షాంపూ, కండీషనర్ ఉపయోగించాలి. ముఖ్యంగా రసాయనాలు ఉండకూడదు. సహజ పదార్థాలతో తయారు చేసిన షాంపూ, కండీషనర్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీని వల్ల జుట్టులో పొడిబారడం ఉండదు. ఇంకా జుట్టును తేమగా ఉంచుతుంది.
హెయిర్ స్ట్రెయిటనర్, డ్రైయర్ వంటి ఏ పరికరాలను జుట్టుకు ఉపయోగించవద్దు. దీని వల్ల జుట్టు విరిగిపోతుంది. అవి మీ జుట్టును దెబ్బతీస్తాయి, బలహీనపరుస్తాయి, పొడిగా మారుస్తాయి. కాబట్టి ఈ తరహా పరికరాలను వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి.
జుట్టును తడిగా ఉంచండి:
వేసవి ఎండల వల్ల జుట్టు పొడిగా మారుతుంది. కాబట్టి పొడిగా మారిన జుట్టును అప్పుడప్పుడు తడిగా ఉంచడం చాలా అవసరం. దీని కోసం ఒక స్ప్రే బాటిల్ కొని అందులో నీటితో లావెండర్ నూనె కలపండి. (లావెండర్ నూనెను ఎక్కువగా కలపవద్దు). జుట్టు ఎప్పుడెప్పుడు పొడిగా మారుతుందో అప్పుడు ఈ నీటిని మీ జుట్టు మీద చల్లండి. దీని వల్ల జుట్టు పొడిగా మారదు. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
ప్రస్తుతం షాపుల్లో సీరం దొరుకుతుంది. ఇది జుట్టుకు హాని కలిగించదు. ఎందుకంటే ఇది కూడా ఒక విధమైన నూనెనే. అంటే నూనె నుంచి కొవ్వును తీసివేసిన తర్వాత వచ్చేదే సీరం. దీన్ని మీరు రోజు రాసినా జుట్టుకు ఎలాంటి సమస్య రాదు. అన్ని వయసుల వారు దీన్ని ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును ఎండ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఇది జుట్టు రంగును మార్చదు.
హెయిర్ మాస్క్:
వేసవి కాలంలో వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి. అలా మీరు స్నానం చేసే ముందు తప్పనిసరిగా ఏదో ఒక హెయిర్ మాస్క్ వేయండి. మాస్క్ వేసిన తర్వాత 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూ వేసి స్నానం చేయాలి. హెయిర్ మాస్క్ వేస్తే వేసవి ఎండల వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వదు.