అందంగా కనిపించేందుకు అమ్మాయిలు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంది.. మార్కెట్లో లభించే ఎన్నో రకాల క్రీములను ఫేస్ ప్యాకులుగా వాడే ఉంటారు. అయినా ప్రయోజనం లభించక అలసిపోయారా..? అలాంటివివారు.. ఈ హోం రెమిడీతో అద్భుతంగా మెరిసిపోవచ్చు.
undefined
మనందరికీ బెల్లం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఓ అవగాహన ఉంది. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని.. దాని బదులు బెల్లం వాడుతూ ఉంటాం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాగా.. ఈ బెల్లాన్ని తినడం మాత్రమే కాదు.. ఫేస్ ప్యాక్ లా వాడటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
బెల్లం ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మంపై మొటిమల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. యవ్వనంగా మెరిసిపోవడానికి సహకరిస్తుంది.
undefined
చర్మం మెరవాలంటే... రెండు స్పూన్ల బెల్లం పొడి, రెండు స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం.. ఈ మూడింటిని మిశ్రమంలా కలపాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతాల్లో అప్లై చేయాలి. 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మెరుస్తుంది.
face pack
ముఖంపై మచ్చలు పోవాలంటే.. ఒక టీస్పూన్ బెల్లం పొడిని తీసుకొని.. దానిలో ఒక టీస్పూన్ టమాట రసం , నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
skin care
మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోవాలంటే.. కొద్దిగా బెల్లం తీసుకొని.. అందులోకొంచెం వేడి నీరు పోసి.. పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మొటిమలపై రాయాలి. ఆ తర్వాత.. కొద్దిసేపటికి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, వాటి మచ్చల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ ఈ బెల్లం ఫేస్ మాస్క్ లను ఉపయోగిస్తే.. మీరు అందంగా మెరిసిపోవడం ఖాయం.
pimples