rosemary oil
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రోజ్ మేరీ వాటర్ , రోజ్ మేరీ ఆయిల్ గురించే ఎక్కువగా వినపడుతోంది. ఈ రోజ్ మేరీ ఆకులతో తయారు చేసిన వాటర్, లేదా ఆయిల్ వాడితే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని అంటున్నారు. ఇందులో నిజం ఎంత..? నిజంగా రోజ్ మేరీ ఆకులు.. జుట్టు పెరగడానికి సహాయపడతాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
rosemary
రోజ్ మేరీ వాటర్ , ఆయిల్ ని జుట్టు కోసం చాలా కాలంగా వాడుతూనే ఉన్నారు. కానీ.. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా సెలబ్రెటీలందరూ వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది.
రోజ్మేరీ నీటిని జుట్టు పెరుగుదలకు ఉపయోగించడం వల్ల వెంట్రుకల కుదుళ్లను పునరుజ్జీవింపజేస్తుంది. అసలు ఈ రోజ్ మేరీ వాటర్ ని ఎలా తయారు చేస్తారు..? దానిని ఎలా జుట్టుకి అప్లై చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
రోజ్మేరీ నీరు, దాని పేరు సూచించినట్లుగా, తాజా రోజ్మేరీ ఆకులను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయబడిన సాధారణ ఇంకా శక్తివంతమైన కషాయం. ఈ సుగంధ మూలిక, దాని పాక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది, సాంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇప్పుడు జుట్టు సంరక్షణ కోసం వినియోగిస్తున్నారు. దీనిలో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వాటర్ ని జుట్టు కుదుళ్లకు రాసి , మంచిగా మసాజ్ చేయడం వల్ల.. జుట్టు బలంగా పెరుగుతుంది.
Rosemary
కేవలం రోజ్ మేరీ వాటర్ మాత్రమే కాదు.. దీనితో తయారు చేసిన ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో ,ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కీలకంగా పని చేస్తుంది. తలలో రక్త ప్రవాహాన్ని పెంచడం, మంటను తగ్గించడం , ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించడం వంటి దాని సామర్థ్యం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
Image: Freepik
ప్రస్తుతం మార్కెట్లో ఈ రోజ్ మేరీ వాటర్, ఆయిల్ లభిస్తాయి. అయితే.. వాటిని వాడటం ఇష్టం లేకపోతే.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త ఓపిక ఎక్కువగా ఉండాలి. తయారు చేసిన రోజ్ మేరీ వాటర్ లేదా ఆయిల్ ని.. మంచిగా స్కాల్ప్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనిని మీ హెయిర్ కేర్ రోటీన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తల స్నానానికి ముందు అయితే ఆయిల్ అప్లై చేయవచ్చు. లేదు.. తలస్నానం తర్వాత అంటే.. రోజ్ మేరీ వాటర్ ని వాడొచ్చు. ఎలా వాడినా ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.