Banana Peel Face Pack: తొక్కే కదా అని పడేయకండి.. మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్ వేసుకోండి

Published : Feb 13, 2025, 12:57 PM ISTUpdated : Feb 13, 2025, 12:58 PM IST

Banana Peel Face Pack: అరటి పండు తిన్న వెంటనే తొక్కను పడేస్తాం కదా.. కాని ఆ తొక్కలోనే మీ చర్మాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయని మీకు తెలుసా? ఇవి ముఖ్యంగా ఫేస్ పై చర్మాన్ని కాపాడటానికి చాలా బాగా సహాయపడతాయి. అరటి తొక్కను కొన్ని పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్ లుగా వేసుకొంటే ఎప్పుడూ లేనంత కాంతివంతంగా మీ ఫేస్ మెరిసిపోతుంది. ఆ ఫేస్ ప్యాక్ లు, వాటిని తయారు చేసే విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
15
Banana Peel Face Pack: తొక్కే కదా అని పడేయకండి.. మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్ వేసుకోండి

1. అరటి తొక్క – తేనె ఫేస్ ప్యాక్
అరటి తొక్కలోని గుజ్జును తీసి, దానికి తేనెను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం తేమగా మారుతుంది. దీంతో మీ ఫేస్ మృదువుగా, ప్రకాశంగా మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. 

తయారీ ఇలా..
అరటి తొక్క లోపట గుజ్జు లాంటి పదార్థాన్ని తీసి దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ముందుగా మీ ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న డస్ట్ పార్టికల్స్ తొలగిపోతాయి. ఇప్పుడు తయారు చేసిన పేస్ట్ ని ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడితే మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. 
 

25

2. అరటి తొక్క – పసుపు ఫేస్ ప్యాక్

మొహంపై మొటిమలు ఉన్న వారికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గిస్తాయి. మీ చర్మాన్ని తేలికగా, కాంతివంతంగా మారుస్తుంది. 

తయారీ ఇలా..
అరటి తొక్క లోపలి భాగాన్ని తీసి పేస్ట్ లా చేయండి. దీనిలో అర టీ స్పూన్ పసుపు పొడి కలపాలి. దీనికి కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తే మరింత మంచిది. ఈ పేస్ట్ ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. అంతే కాంతివంతంగా మారిన మీ ముఖాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. 

35

3. అరటి తొక్క – కలబంద ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ఫ్యాక్ ఎండ ప్రభావం వల్ల దెబ్బతిన్న చర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇది 
చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఇలా తయారు చేయండి.. 
అరటి తొక్కలోని గుజ్జును తీసి పేస్ట్ లా చేసి అందులో 1 టీస్పూన్ తాజా కలబంద జెల్ కలపండి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరు వెచ్చని లేదా చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల మీ చర్మం హైడ్రేట్ అవుతుంది. 

45

4. అరటి తొక్క – ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

డెడ్ స్కిన్ ను తొలగించేందుకు సహాయపడే ఫేస్ ప్యాక్ ఇది. మీ చర్మంలో దాగి ఉన్న మురికిని కూడా ఇది తొలగిస్తుంది. 

తయారీ విధానం..
టీస్పూన్ ఓట్‌మీల్ పొడిని అరటి తొక్క పేస్ట్ తో కలపాలి. దీనికి కొంచెం పాలు యాడ్ చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ముఖంపై ఉండే మీ చర్మం చాలా శుభ్రంగా మారుతుంది. 

55

5. అరటి తొక్క – నిమ్మరసం ఫేస్ ప్యాక్
చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మంపై ఉన్న జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది. 

తయారు చేసే విధానం ఇది..
అరటి తొక్కలోని పేస్ట్ తీసుకొని దానికి 1 టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం సహజంగా, కాంతివంతంగా మారుతుంది. 

ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్ లను వారంలో 2-3 సార్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి.

click me!

Recommended Stories