స్టన్నింగ్ బ్యూటీ కియారా అద్వానీ.. డైట్ సీక్రెట్ ఇదే..!

First Published May 26, 2021, 12:23 PM IST

అంతలా ఆమెకు జనాలు కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె అందమే. ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఈ స్టన్నింగ్ బ్యూటీ వర్కౌట్స్ తోపాటు.. స్పెషల్ డైట్ ఫాలో అవుతుందట. 

కియారా అద్వానీ.. పరిచయం అక్కర్లేని పేరే. చేసింది తక్కువ సినిమాలు అయినా.. అందరి కళ్లు తనపై పడేలా చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి అదరగొట్టిన ఈ బ్యూటీ.. తెలుగులో మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది.
undefined
ఈ రెండు చిత్రాల్లో ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అందుకే.. బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లోనూ ఆమెకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. మళ్లీ ఈ హాట్ బ్యూటీ తెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నవారు లేకపోలేదు.
undefined
అంతలా ఆమెకు జనాలు కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె అందమే. ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఈ స్టన్నింగ్ బ్యూటీ వర్కౌట్స్ తోపాటు.. స్పెషల్ డైట్ ఫాలో అవుతుందట. మరి ఆ డైట్ ఏంటో.. ఆమె ఏం తింటుందో మనం కూడా తెలుసుకుందాం..
undefined
కియారా ఉదయాన్నే.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతారట. తన రోజుని ఆమె ఇలానే ప్రారంభిస్తారట. ఈ గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఆ రోజంతా తన మెటబాలిజం సరిగా ఉంటుందని ఆమె నమ్ముతారు.
undefined
ఆ తర్వాత ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటారు. ఒక కప్పు ఓట్స్ లో యాపిల్, స్టాబెర్రీ, ఆరెంజెస్, బెర్రీస్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా వర్కౌట్స్ చేస్తారు. వర్కౌట్స్ కి ముందు యాపిల్, పీనట్ బటర్ ని స్నాక్స్ లాగా తీసుకుంటుందట.
undefined
షూటింగ్స్ ఉన్నా లేకున్నా.. ఆమె హోమ్ మేడ్ ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఎక్కువగా మధ్యాహ్నం లంచ్ లో కూరగాయలు, బ్రెడ్ తీసుకుంటారు.
undefined
ఆ కూరగాయల్లో ఎక్కువగా పాలకూర, గుమ్మడికాయ ఎక్కువగా తీసుకుంటారట. ఎక్కువగా ఆయిల్, ఉప్పు ఉండే ఆహారాలకు మాత్రం దూరంగా ఉంటారట.
undefined
డిన్నర్ లోనూ దాదాపు ఇదే ఫుడ్ రిపీట్ చేస్తారట. అయితే.. నాన్ వెజ్ లో ఫిష్ తినడానికి ఆమె ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కియారాకి చేపలంటే చాలా ఇష్టమట.
undefined
అపపుడప్పుడు వాల్ టన్స్, ఆల్ మండ్స్ తీసుకుంటారట. ఈ డైట్ ఫాలో అవ్వడమే కాకుండా.. తీసుకునే మీల్స్ టైం ప్రకారం తీసుకుంటారట. ఇక వ్యాయమం కూడా తప్పకుండా తీసుకోవడంతోపాటు.. టైమింగ్స్ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే.. ఇంత అందంగా కనపడుతోంది.
undefined
click me!