ముఖానికి పసుపును ఎలా ఉపయోగించాలి?
పసుపులో ఎన్నో ఔషదగుణాలు దాగుంటాయి. ఇది మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మానికి దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది పసుపును నేరుగా చర్మానికి అప్లై చేస్తారు. కానీ పసుపును ఇలా వాడటం వల్ల మచ్చలు అవుతాయి. అందుకే పసుపులో ఏదో ఒకటి మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలని చెప్తారు. అంతే కాకుండా పసుపు వేడిగా ఉంటుంది. దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేస్తే ముఖంపై దద్దుర్లు వస్తాయి. దురద పెడుతుంది. చర్మం ఎర్రగా మారుతుంది. అందుకే పాలు, తేనె, పెరుగు, శనగపిండి, పిండి, కలబంద జెల్ మొదలైన వాటిలో ఏదో ఒకటి పసుపులో కలిపి వాడాలి.