సెలబ్రెటీలు ఏది మాట్లాడినా.. ఏ ట్వీట్ చేసినా వెంటనే క్షణాల్లో వైరల్ అయిపోతాయి. ఎందుకంటే.. వారిని ఫాలో అయ్యేవాళ్లు వేలల్లో, లక్షల్లో ఉంటారు. కాబట్టి.. వారు ఏది చేసినా వెంటనే అందరికీ తెలిసిపోతుంది. అయితే.. కొందరు మాత్రం మరింత ఫేమస్ అవ్వడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు.
undefined
అలా ఓ బెంగాలీ నటి చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. నెటిజన్లు మాత్రం ఆమెకు భయంకరంగా చివాట్లు పెడుతున్నారు. హిందూ దేవుడిని అవమానిస్తావా అంటూ మండిపడుతున్నారు.
undefined
ఇంతకీ మ్యాటరేంటంటే.. బెంగాలీ నటి సయోని ఘోష్... ఇటీవల తన ట్విట్టర్ లో ఓ కార్టూన్ పెట్టారు. ఆ కార్టూన్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
undefined
ఆ కార్టూన్ లో ఓ మహిళ.. శివ లింగానికి కండోమ్ ధరిస్తూ ఉంటుంది. దానికి క్యాప్షన్ గా ‘ దేవుడి వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు’ అని రాసి ఉంది.
undefined
దీంతో.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూ దేవులను కించపరుస్తావా అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఈ వివాదంలోకి బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగి.. ఆమెపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
undefined
దీంతో.. ఆమె ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. ఆ పోస్టు తాను చేయలేదని ఆమె చెప్పడం గమనార్హం.
undefined
ఇదిలా ఉండగా... హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ బెంగాలీ నటి సయోని ఘోష్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు, మేఘాలయ మాజీ గవర్నర్ తథాగతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
undefined
కాగా తన ట్విట్టర్ ఖాతాను 2015 ఫిబ్రవరిలో హ్యాక్ చేసిన వ్యక్తి ఈ వివాదాస్పద పోస్టు పెట్టారని నటి సయోని ఘోష్ అంటున్నారు.
undefined
కాని ఐపీసీ సెక్షన్ 295 ఎ కింద నేరం చేసినందున దీని పరిణామాలకు సిద్ధంగా ఉండాలని రాయ్ ట్విట్టరులో తెలిపారు. ఈ విషయంపై బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
undefined
కాగా ‘‘2010లో నేను ట్విట్టరులో చేరాను. 2015లో నా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. దీంతో నేను ట్విట్టర్ ఖాతాను వదిలేశాను’’ అని బెంగాల్ నటి సయోని చెప్పారు.మొత్తం మీద బెంగాల్ నటిపై బీజేపీ నేత ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
undefined
పలు బెంగాళీ సినిమాల్లోనూ, షార్ట్ ఫిల్మ్స్ లోనూ సయోని నటించింది.
undefined