పెళ్లి జీవితంలో ఓ ఆనందకరమైన, అందమైన ప్రయాణం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నామనే ఆలోచన.. పెళ్లికూతురిలో కంగారు మొదలౌతుంది. ఓ వైపు ఆనందంతో ఉబ్బిపోతున్నా... మరో వైపు ఎంతో కొంత కంగారు ఉండనే ఉంటుంది. కొత్త ఇంట్లో అడుగుపెట్టడం, వారి బంధువులను అర్థం చేసుకోవడం.. ఇలా ఎన్నో ప్రశ్నలు వారిని బుర్రను తినేస్తూ ఉంటాయి. అసలు పెళ్లి అనగానే.. వధువు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..