రెండోసారి ఆడపిల్ల పుడితే రూ.6000.. కేంద్ర ప్రభుత్వ పథకం వివరాలివిగో..

Published : Aug 20, 2024, 06:10 PM ISTUpdated : Aug 20, 2024, 06:15 PM IST

ఆడ పిల్లల శిశు మరణాలు అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మొదటి కాన్పులో ఎవరు పుట్టినా రూ.5000 నగదు ఇస్తున్న ప్రభుత్వం రెండో సారి ఆడపిల్ల పుట్టినా రూ.6000 నగదు ఇచ్చేలా ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని మార్పు చేసింది. ఆ వివరాలు తెలుసుకోండిలా..  

PREV
14
రెండోసారి ఆడపిల్ల పుడితే రూ.6000.. కేంద్ర ప్రభుత్వ పథకం వివరాలివిగో..

శిశు మరణాలు నివారించాలనే..
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని 2017 నుండి అమలు చేస్తోంది. గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. శిశు మరణాలను నివారించాలని మొదటి కాన్పులో ఎవరు పుట్టినా రూ.5000 నగదును విడదల వారీగా అందజేస్తోంది. ఇప్పుడు రెండో  కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6000 ఇచ్చేలా ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం, ఇతర వ్యాధులను నివారించడానికి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తోంది. 
 

24

వీరు అప్లై చేసుకోవచ్చు..
కనీసం 19 ఏళ్లు నిండిన మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలు, వికలాంగ మహిళలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డ్ హోల్డర్లు, ఈ-శ్రమ్ కార్డ్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం రూ.1000 కంటే తక్కువ ఉన్న మహిళలు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు ఈ పథకానికి అనర్హులు.
 

34

రెండో కాన్పులో ఆడపిల్ల పుడితేనే..
సాధారణంగా మొదటి కాన్పులో ఎవరు పుట్టినా కేంద్ర ప్రభుత్వం రూ.5000 నగదు అందజేస్తోంది. దీని మూడు విడతలుగా ఇస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితేనే రూ.6000 నగదు ఇస్తారు. మొదటి సారి ఆడపిల్ల పుట్టి, రెండో సారి కూడా ఆడపిల్ల పుడితే నిరుపేద కుటుంబాల్లో కొందరు పెంచలేక చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకొనేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని తాజాగా మార్పుచేశారు. 

44

అంగన్ వాడీ కేంద్రాల్లో వివరాలు..
ఈ పథకం వర్తించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. గర్భధారణ సమయంలోనే నమోదు తప్పనిసరి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన మహిళలు నేరుగా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఒక  వేళ కవలలు పుడితే వారిలో ఒకరు ఆడపిల్ల అయినప్పటికీ రూ.6000 నగదు ఇస్తారు. 
 

click me!

Recommended Stories