పని ఒత్తిడి, అలసట, సరిగా నిద్రలేకపోవడం కారణం ఏదైనా మనల్ని తలనొప్పి అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గుతుందా అంటే... అస్సలు తగ్గదు. తలనొప్పి సమయంలో మనకు ఏ పనీ చేయాలని అనిపించదు. ఫక్కన ఎవరైనా మాట్లాడినా కూడా తల పగిలిపోతూ ఉంటుంది. తలనొప్పితో వచ్చే బాధ అంతా ఇంతా కాదు.
కొందరికి అయితే.. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు. మరి కొందరికి.. ట్యాబ్లెట్స్ వాడటం పెద్దగా నచ్చదు. మరి.. ట్యాబ్లెట్ లేకుండా కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..? ఈ కింది డ్రింక్ తాగితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. తలనొప్పిని చిటికెలో తగ్గించే ఆ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
Image: Freepik
అధిక రక్తపోటు ఉన్నవారు.. రాత్రి తాగింది దిగక హ్యాంగోవర్ కారణంగా, జ్వరం, ఒత్తిడి, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యల కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారికి కూడా తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే...ప్రత్యేకమైన ఆయుర్వేద టీ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది,
ఈ ఆయుర్వేద టీ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు..
1 గ్లాసు నీరు
1/2 స్పూన్ వాము
1 తరిగిన పచ్చి ఏలకులు
1 టేబుల్ స్పూన్ దనియాలు`
5 పుదీనా ఆకులు
దీన్ని మూడు నిమిషాలు ఉడకబెట్టి, తర్వాత వడగట్టి సిప్ బై సిప్ తాగాలి. మీరు చాలా వేడిగా త్రాగకూడదు, మీరు గోరువెచ్చని టీ తాగవచ్చు. ఇది తలనొప్పి సమస్య నుండి చాలా ఉపశమనం ఇస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే ఉపశమనం కలిగిస్తుంది. ప్రయత్నించి చూడండి.