పూర్వం నుంచి.. భర్త కష్టపడి డబ్బు సంపాదించుకొని వస్తే.. ఆ డబ్బుతో జాగ్రత్తగా.. ఇంటిని భార్య నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడంటే.. మహిళలు బయటకు వచ్చి.. ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ.. అంతకముందు అలా ఉండేది కాదు. ఎక్కువ మంది.. కేవలం పురుషులు మాత్రమే ఉద్యోగం చేయాలనే నమ్మకం ఎక్కువగా ఉండేది. ఈ సంగతి పక్కన పెడితే.. మహిళలు.. డబ్బు నిర్వహణలో వారిని మించిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. ఇంటిని బాధ్యతగా.. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి. ఎక్కడ పెట్టకూడదు అనే విషయాన్ని వారు బాగా ఆలోచిస్తారు. అయితే.. అంత బాధ్యతగా నిర్వహిస్తూ వస్తున్నప్పటికీ.. ఈ విషయంలో.. మహిళల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.
money
ఇప్పటికీ... పనిచేసినా, ఇంటి ఆదాయానికి సహకరించినా లేదా ఒంటరిగా జీవనోపాధి పొందుతున్నప్పటికీ, డబ్బుపై మహిళలకు అధికారం లేదనే భావన వారిని బాధిస్తుంది. మహిళలు, డబ్బు చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి,నేటికీ మహిళలను వెనుకకు నెట్టే ఐదు డబ్బు అపోహలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
అపోహ: మహిళలకు డబ్బు మ్యానేజ్ చేయడం రాదు..!
ఆడపిల్లలు చదువుకునే వయసు నుంచే.. కాలేజీలో అబ్బాయిలును ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ ఎంచుకోమని సలహా ఇస్తారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే. హోమ్ సైన్స్, ఆర్ట్స్ వంటివి ఎంచుకోమని సలహా ఇస్తారు. అక్కడి నుంచే జెండరీ స్టీరియోటైపింగ్ కొనసాగుతూ ఉంుటది. సంపాదించడం వచ్చినా.. వాటిని ఎలా దేనికి ఖర్చు చేయాలనే విషయం వారికి తెలీదని చాలా మంది అనుకుంటారు. అయితే పూర్తిగా అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి డబ్బుని మహిళలే మంచిగా మ్యానేజ్ చేయగలరు. ప్రతి మహిళ ఆర్థిక వేత్త వలే.. ఇంటి బడ్జెట్ ని బ్యాలెన్స్ చేస్తారు. మన అమ్మమ్మల కాలంలో కూడా.. కనీసం అక్షరం ముక్క నేర్చుకోని మహిళలు కూడా ..ఇంటిని బ్రహ్మాండంగా నడిపేవారు. మహిళలు.. డబ్బు మ్యానేజ్ చేయడం రాదు అనేది కచ్చితంగా అపోహే. నిజం కాదు.
అపోహ 2: మహిళలు పెట్టుబడి పెట్టలేరు ఎందుకంటే వారికి ఎలా చేయాలో తెలియదు.
సాంప్రదాయకంగా, పురుషులు ఆ డబ్బు సంపాదించనప్పటికీ, ఇంట్లో డబ్బును నియంత్రించడం , నిర్వహించడం చేశారు. ఇంతకుముందు, ఒంటరిగా జీవనోపాధి పొందే స్త్రీలు తన సంపాదనను ఇంటిలోని పురుషులకు అప్పగించవలసి ఉంటుంది, ఎందుకంటే వారికి పెట్టుబడులు, డబ్బు నిర్వహణ గురించి తెలియదని వారి అభిప్రాయం. దానినే ఇప్పటికీ ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. నిజానికి అందులోనూ ఎలాంటి నిజం లేదు.
మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. తెలీదు అని కూర్చుంటే.. ఎప్పటికీ తెలీదు. కాబట్టి.. ఆసక్తి పెంచుకొని.. ఆ పెట్టుబడుల గురించి తెలుసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. వ్యాపారాల్లో రాణించే మహిళలు చాలా మందే ఉన్నారు.
అపోహ 3: స్త్రీ తన భర్త ఇంటికి వెళ్లిన తర్వాతే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి ఎందుకంటే అది భర్త బాధ్యత. పెట్టుబడులతో సహా మహిళలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన నిర్ణయాలు, పెట్టుబడులతో సహా, ఆమె పెళ్లి చేసుకునే మొదలుపెట్టకూడదు..
వాస్తవికత: మీ పెట్టుబడులను ప్రారంభించడం చాలా తొందరగా ఉండదు, ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవించగలరని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అందువల్ల, వారికి ప్రత్యేక పదవీ విరమణ . ఆరోగ్య నిధులు ఉండటం అత్యవసరం. బలమైన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో మహిళ ఆమె జీవితంలోని అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.
అపోహ 4: మహిళలు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి వారు పొదుపు చేయలేరు.
రియాలిటీ: మహిళలుు షాపింగ్ ఎప్పుడూ వారికోసమే ఉండదు. వారి కుటుంబసభ్యుల కోసం కూడా చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉంటే.. అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వారితరపున షాపింగ్ చేస్తారని తెలుసుకోవాలి. శ్రామిక శక్తిలో భాగం కావడం ద్వారా, మహిళలు వేతన జీవులుగా మారారు. ఇది వారికి గొప్ప ఆర్థిక శక్తిని అందిస్తోంది. వారికి షాపింగ్ చేయడం వచ్చు.. పొదుపు చేయడం కూడా వచ్చు
అపోహ 5: పెట్టుబడి పరంగా స్త్రీకి ఏది ఉత్తమమో పురుషుడికి తెలుసు.
వాస్తవికత: తనకు ఏది ఉత్తమమో స్త్రీకి మాత్రమే తెలుసు. ఆర్థిక స్వాతంత్ర్యం మీ మొదటి లక్ష్యం కావాలి.