ముఖం నిర్జీవంగా మారిందా...? అరటి ట్రై చేయండి..!

First Published Jul 12, 2021, 11:56 AM IST

అరటి తొక్కు కూడా అంతే ప్రయోజనాలు అందించగలదు. దీనిలో విటమిన్ బి6, బి12 ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా... అందంగా కనిపించడానికి సహాయం చేస్తాయి.

ఈ ప్రపంచంలో పనికి రాని మనిషి ఉంటాడేమో కానీ.. పనికి రాని వస్తువు అంటూ ఏదీ ఉండదు అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. అందులోనూ అరటి తొక్క కూడా ఉంది. అర్థం కాలేదా..? మనమందరం.. అరటి పండు తినేసి.. తొక్కని అవతలికి విసేరిస్తాం. అయితే.. అలా విసిరేసే అరటి తొక్కతో మన చర్మాన్ని అందంగా మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
అరటి పండు మన శరీరానికీ.చర్మానికీ మంచి పోషణను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే.. అరటి తొక్కు కూడా అంతే ప్రయోజనాలు అందించగలదు. దీనిలో విటమిన్ బి6, బి12 ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా... అందంగా కనిపించడానికి సహాయం చేస్తాయి.
undefined
1.బనానా పీల్ మాస్క్..ఒక అరటిపండు తీసుకొని తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఈ తొక్కలన్నింటినీ కలిసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దీనిలో కొద్దిగా రెండు స్పూన్ల పాలు వేసిక లపాలి. తర్వాత దీనిని 10-15 నిమిషాలపాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. ఆ తర్వాత ముఖం,మెడ అంతా రాయాలి. ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.
undefined
2.పీల్ స్క్రబ్బర్..కేవలం బనానా తొక్కతో కూడా ముఖానికి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. బనానా తొక్కుతో ముఖం, మెడను బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి.. చర్మంలోని ఆయిల్ గ్రంథులను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మెరిసిపోతుంది.
undefined
3.పళ్లు తెల్లగామారతాయి..ఈ మధ్యకాలంలో ఎంత బ్రష్ చేసినా.. పసుపు పచ్చగానే కనపడతాయి. అలాంటివారు.. ఈ అరటి తొక్కతో తెల్లగా మార్చుకోవచ్చు. బనానా తొక్కతో పళ్లను రద్దితే.. పసుపు రంగు పోయి.. తెల్లగా మారతాయి.
undefined
4.కంటికింద నల్లటి వలయాలు..కంటి కింద నల్లటి వయాలను తొలగించడానికి కూడా ఈ అరటి పండు పనిచేస్తుంది. అరటి పండు తొక్కతో సహా.. రెండు ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి.. ఆ తర్వాత.. వాటిని కంటికింద సుతిమెత్తగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు, వాచినట్లు ఉండటం లాంటి సమస్యలు తగ్గుతాయి.
undefined
5.ప్రతిరోజూ పెదాలపై పది నిమిషాల పాటు..అరటి తొక్కను రుద్దాలి. అలా రుద్దడం వల్ల.. పెదాలు అందంగా కనపడతాయి.
undefined
click me!