ఎండాకాలం వచ్చిందంటే చాలు సోమరితనం వచ్చేస్తుంది. ఈ సీజన్ లో ఇంటిని క్లీన్ చేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇక బాత్రూం ను క్లీన్ చేయాలంటే ఎలా అనిపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాత్రూమ్ ను క్లీన్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పని చేయాలి. ఎండాకాలంలో బాత్ రూం ను క్లీన్ చేయడమంత కష్టమైన పని మరోటి లేదు అని అనిపిస్తే మీకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవును కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు చాలా తొందరగా బాత్ రూం ను శుభ్రం చేయగలుగుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బాత్రూంను శుభ్రం చేసేలా ప్లాన్
బాత్ రూం ను శుభ్రం చేయడానికంటే ముందు మీరు ఏవి ముందు క్లీన్ చేయాలో ఒక ప్లాన్ వేసుకోండి. ఎందుకంటే మీరు బాత్ రూం లో శుభ్రం చేయాల్సినవి చాలానే ఉంటాయి. అందుకే మీరు మీ సౌలభ్యాన్ని బట్టి పనిని త్వరగా అయిపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
షవర్ క్లీనర్ ఉపయోగించండి
బాత్ రూం ను క్లీన్ చేయడానికి మీరు షవర్ క్లీనర్ ను ఉపయోగించండి. దీన్ని ఉపయోగించి మీరు బాత్ రూం నేల, గోడలను ఫాస్ట్ గా, సులభంగా శుభ్రం చేయొచ్చు. ఇలా కాకుండా మగ్ లేదా బకెత్ తో శుభ్రం చేస్తే చాలా టైం పడుతుంది.
బాత్ రూం అద్దం శుభ్రం చేయండి
బాత్ రూం ను త్వరగా శుభ్రపరిచేది అద్దం మాత్రమే. అందుకే బాత్ రూం లో అద్దం ఉంటే దాన్నే ముందుగా క్లీన్ చేయండి. దీని కోసం మీరు మైక్రోఫైబర్ క్లాత్, క్లీనింగ్ స్ప్రే ఉపయోగించొచ్చు.
సింక్, బాత్ టబ్
సింక్ ను, బాత్ టబ్ ను ఫాస్ట్ గా శుభ్రం చేయడానికి మీరు తేలికపాటి డిటర్జెంట్, గోరు వెచ్చని నీటిని ఉపయోగించొచ్చు. దీనిలో ఎక్కువ మురికి ఉంటే స్పాంజ్ లేదా బ్రష్ ఉపయోగించి వీటిని క్లీన్ చేయండి.
బాత్ రూం ఫ్లోర్ ను శుభ్రం చేయండి
ఎండాకాలంలో బాత్ రూం ఫ్లోర్ ను ఫాస్ట్ గా, తెల్లగా మెరిసేలా శుభ్రం చేయడానికి మీరు డిటర్జెంట్, వేడి నీటిని ఉపయోగించొచ్చు. ఫ్లోర్ ను తుడవడానికి మీరు మాట్ ను ఉపయోగించొచ్చు.
టాయిలెట్ క్లీనర్
బాత్ రూం తో పాటుగా టాయిలెట్ ను కూడా ఒకేసారి క్లీన్ చేస్తే అయిపోతుందని అనిపిస్తుంటుంది. కానీ టాయిలెట్ ను క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు టాయిలెట్ క్లీనర్ తో చాలా ఫాస్ట్ గా టాయిలెట్ ను క్లీన్ చేయొచ్చు.