కానీ.. మృణాల్ మాత్రం ఈ ఫార్ములాకి చాలా విరుద్దం అంట. ఇప్పటి వరకు మృణాల్ రూ.2వేలకు మించి ఖరీదైన డ్రెస్ ఒక్కటి కూడా కొనలేదు అంటే మీరు నమ్మగలరా..? ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అదేంటి.. చాలా పార్టీలు, ఫంక్షన్స్ లో మంచి డిజైనర్ వేర్స్ వేసుకొని వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు.. అవన్నీ ప్రమోషన్స్ లో భాగంగా, కంపెనీ వాళ్లు ఆఫర్ చేసిన దుస్తులేనట.