వెండి పట్టీలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లకు వెండి అన్నా, బంగారమన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళా కాళ్లకు ఖచ్చితంగా పట్టీలను పెట్టుకుంటుంది. కానీ ఈ వెండి పట్టీలు పెట్టుకుంటే ఏం అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? 

Silver Anklets

ఆడవాళ్లు కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వల్ల వారి అందం మరింత పెరుగుతుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ పట్టీలను పెట్టుకుంటుంటారు. అయితే వెండి పట్టీలను పెట్టుకునే ఆచారం ఎప్పటి నుంచో వస్తోంది. దీన్ని ఒక సంప్రదాయంగా కూడా పాటిస్తున్నారు. అయితే మన పూర్వీకులు చెప్పే ప్రతిదానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఇది సాంప్రదాయకంగా అనుసరిస్తున్నప్పటికీ.. ఎన్నో రకాల డిజైన్లలో వీటిని పెట్టుకుంటున్నారు. అసలు వెండి పట్టీలను పెట్టుకుంటే ఆడవారికి ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వెండి పట్టీలను పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు 

1. సాధారణంగా మగవారిలో కంటే ఆడవాళ్ల శరీరంలోనే వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వేడి తగ్గేందుకు వెండి పట్టీలను ధరిస్తారని పెద్దవారు చెప్తారు. 

2. ఆడవాళ్లు కాళ్లకు వెండి పట్టీలను పెట్టుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. సిల్వర్ మెటల్ చీలమండలను తాకి ఎముకలను బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 


3. వెండి పట్టీలను పెట్టుకునే మహిళలు రుతుక్రమ సమస్యలకు దూరంగా ఉంటారట. అలాగే గర్భాశయం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తారు. అలాగే వెండి పట్టీలను ధరించడం వల్ల మహిళల్లో హార్మోన్ల స్థాయిలను సమతుల్యంగా ఉంటాయని ఎన్నో అధ్యయనాలు కూడా వెళ్లడిస్తున్నాయి. 

4. ఆడవాళ్లు రోజంతా నిలబడి ఎన్నో పనులు చేయడం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అయితే వెండి పట్టీలను పెట్టుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Silver Anklets

5. వెండి పట్టీలు మడమ నాడిని తాకుతాయి. ఇది ఈ నాడి ద్వారా మెదడుకు వెళ్లే అనుభూతులను నియంత్రిస్తుంది. మహిళల నడుము భాగాన్ని బలోపేతం చేయడానికి కూడా వెండి పట్టీలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పూర్వీకులు కాలానికి అనుగుణంగా వెండిని కాళ్లకు కడాలు,పట్టీలు వంటి ఎన్నో రూపాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. 

Latest Videos

click me!