మన వయసు మనం ఆపాలి అనుకున్నా ఆపలేం. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది.. మన వయసు కూడా పెరుగుతుంది. అయితే.. వయసు పెరిగినా.. అది మన ముఖంలో కనపడకపోతే ఎంత బాగుంటుంది. వయసు ఎంత పెరిగినా.. మనం నవ యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం మనలో చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల యాంటీ ఎజెనింగ్ క్రీములు వాడుతూ ఉంటాం. అయితే వేలకు వేలు పోసి ఆ క్రీములు వాడే బదులు.. మనం సహజంగా యవ్వనంగా కనిపించే అవకాశం ఉందట. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేద్దాం..
1.మనలో చాలా మంది ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు. అయితే... చాక్లెట్, క్యారెట్, గ్రీన్ లాంటివి సహజంగా సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తాయట. అందుకే.. ప్రతిరోజూ వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలట.
2.ఇక ప్రతిరోజూ వ్యాయామం చేయడంలో వల్ల చర్మం లో గ్లో పెరుగుతుందట. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం తో పాటు.. మన చర్మాన్ని కూడా అందంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.
anti-ageing foods
3.మన చర్మాన్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి. అప్పుడు మన చర్మం కూడా అందంగా మారుతుందట. అంటే... మనం రెగ్యులర్ గా మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల చర్మం సాగకుండా.. బిగుతుగా ఉంటుంది.
4.వీటితో పాటు.. మనం మన చర్మాన్ని తరచూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకోసం కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ.. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలట. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం సహజంగా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది కూడా మన అందాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది.
5.చాలా మంది పండ్ల రసాలను జ్యూసులుగా తీసుకుంటారు. అయితే... పండ్ల జ్యూస్ లకన్నా కూడా.. గ్రీన్ వెజిటెబుల్ జ్యూస్ తీసుకోవడం మన ఆరోగ్యానికి, అందానికి మంచిదట. అంటే ముఖ్యంగా సొరకాయ లాంటి కాయల జ్యూస్ లు తీసుకోవాలట.
6.ఇక.. రెగ్యులర్ గా ముఖానికి స్క్రమ్ చేస్తూ ఉండాలట. ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల.. మృత కణాలను తొలగించడంతో పాటు.. ముఖం తాజాగా అందంగా మెరిసిపోతుందట.
7.ఇక ముఖం అందంగా మెరిసిపోవడానికి ప్రతిరోజూ ఫేస్ యోగా ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా రోజు రోజుకీ అందం పెరుగుతుంది.
8.ఇక చాలా మంది ప్రతిరోజూ మేకప్ వేసుకుంటూ ఉంటారు. అది చాలా కామన్. అయితే.. పడుకునే ముందు మాత్రం.. ఆ మేకప్ ని కచ్చితంగా తొలగించాలట. మేకప్ ని పూర్తిగా తొలగించడం వల్ల దాని కలిగే డ్యామేజ్ ని ఆపే అవకాశం ఉంటుంది.
9.ఇక.. మనం అందంగా కనిపించాలి అంటే.. మనకు సరైన నిద్ర కూడా చాలా అవసరం. కాబట్టి.. కచ్చితంగా 8 గంటల పాటు నిద్ర కచ్చితంగా పోవాలి. నిద్ర పోవడం వల్ల మనం చర్మానికి జరిగే డ్యామేజ్ ని రిపేర్ చేస్తుందట. కొత్త సెల్స్ పెరగడానికి సహాయపడతాయట. కాబట్టి.. 8 గంటల నిద్ర చాలా అవసరం.