మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఏమేమి చేయొచ్చో తెలుసా?

First Published Sep 20, 2024, 3:44 PM IST

ఏ ఒక్కరూ సబ్బులను పూర్తిగా అయిపోయేదాకా ఉపయోగించరు. అవి అరిగిపోయి చిన్న చిన్న ముక్కలు అయితే వాటిని తీసి డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ పనికిరావు అనుకునే ఈ సబ్బు ముక్కలతో మీరు ఎన్నో పనులు చేయొచ్చు. అవేంటో తెలుసా? 
 

మార్కెట్ లోకి ఎన్నో రకాల లిక్విడ్ సబ్బులు వచ్చాయి. అయినా ఇప్పటికీ చాలా మంది సబ్బు బార్ లనే వాడుతుంటారు. అయితే ప్రతి ఒక్కరూ సబ్బులను పూర్తిగా అయిపోయే దాకా అస్సలు ఉపయోగించరు. అరిగిపోయి చేతికి అందకపోయే సరికి వాటిని డస్ట్ బిన్ లో పారేస్తుంటారు. 

కానీ మీరు మిగిలిపోయిన సబ్బు ముక్కలతో మీరు ఎన్నో పనులు చేయొచ్చు. అవును ఈ మిగిలిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలు ఎన్నో పనులను సులువుగా చేయొచ్చు. ఇంతకీ ఈ అరిగిపోయిన సబ్బు ముక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos



డోర్ సమస్య 

చాలాసార్లు చెక్క తలుపులు ఎటూ కదలకుండా అవుతాయి. దీనివల్ల తలుపులు తెరవడం, మూయడం కష్టమవుతుంది. అయితే చిన్న సబ్బు ముక్క సహాయంతో మీరు ఈ సమస్యను చాలా తొందరగా పరిష్కరించొచ్చు. స్టక్ అయిన తలుపులు లేదా స్లైడర్లకు సబ్బును పెట్టండి. ఇలా చేయడం వల్ల డోర్లు లేదా స్లైడర్లు బాగా స్లైడ్ అవుతాయి. ఎలాంటి సమస్యా ఉండదు. 
 

soap


వార్డ్ రోబ్ ఫ్రెషనర్ లాగ

చిన్న చిన్న సబ్బు ముక్కలను మీరు వార్డ్ రోబ్ ఫ్రెషనర్ లేదా క్లాసెట్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగించొచ్చు.మంచి వాసన వచ్చే సబ్బు ముక్కలను డస్ట్ బిన్ లో వేసే బదులుగా వాటిని గుడ్డ లేదా టిష్యూ పేపర్ లో చుట్టి వాటిని అల్మారా లేదా క్లాసెట్ లోపల పెట్టండి. ఇది వార్డ్ రోబ్, క్లాసెట్ లో మురికి వాసనను పోగొట్టి మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. 
 

తాళం తెరవడానికి

చాలాసార్లు పాత తాళాలు అంత సులువుగా తెరుచుకోవు. అలాగే తాళం వేయడం, తీయడం కష్టంగా ఉంటుంది. వీటిని తెరవాలంటే మనకున్న బలాన్నంతా ఉపయోగించాల్సి ఉంటుంది.

అయితే మీరు ఈ పాత తాళాలను తీయడానికి అరిగిపోయిన సబ్బు ముక్కలను ఉపయోగించొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా సబ్బుపై తాళం చెవిని కొద్ది సేపు రుద్దండి. ఇప్పుడు ఈ సబ్బు కోటెడ్ కీని తాళంలో పెట్టి తీయండి. టక్కున తాళం తెరుచుకుంటుంది. 

జిప్ ని ఫిక్స్ చేయడానికి

చాలాసార్లు ప్యాంటు, జాకెట్ లేదా బ్యాగ్ చెయిన్ ఫెయిల్ అవుతుంటుంది. లేదా ఇరుక్కుపోతుంది. దీని వల్ల వాటిని మూయడానికి లేదా తెరవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే కొంతమంది జిప్ ఫెయిల్ అయ్యిందని కొత్త వాటిని వేయిస్తుంటారు.

కానీ చిన్న చిన్న సబ్బు ముక్కలతో ఈ సమస్యను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందుకోసం ఒక సబ్బు ముక్కను తీసుకొని జిప్ మీద రుద్దండి. ఆ తర్వాత  చెయిన్ ను ఓపెన్ చేసి పైకి, క్రిందికి అనండి. ఇలా చేయడం వల్ల జిప్ ఫిక్స్ అవుతుంది.

click me!