ఇదొక్కటి పెడితే.. తెల్ల జుట్టు నల్లగా అవుతుంది

First Published | Sep 20, 2024, 11:34 AM IST

పెద్దలే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోంది. కానీ ఇది జుట్టు అందాన్ని మొత్తం పాడుచేస్తుంది. అందుకే వారానికోసారి తెల్ల జుట్టును కవర్ చేయడానికి బ్లాక్ కలర్ ను వేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా చేయొచ్చు. అదెలాగంటే? 
 

ఒకప్పుడు తెల్ల జుట్టు ముసలి వాళ్లకు మాత్రమే వచ్చేది. ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వస్తే వయసు మీదపడుతున్నట్టుందని అనేవారు. కానీ ఇప్పడు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అసలు ఈ తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయో తెలుసా? 

నేటి కాలంలో తెల్ల జుట్టు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల వయసుకంటే ముందే ముసలివాళ్లలాగ కనిపిస్తారు. ఇక ఈ తెల్ల జుట్టును దాచడానికి ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. హెయిర్ కలర్స్ ను వాడుతుంటారు. కానీ దీనివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. 

కానీ కొన్ని నేచురల్ వస్తువులతో సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వీటివల్ల మీకు ఎలాంటి జుట్టు సమస్యలు కానీ చర్మ సమస్యలు కానీ రావు. కాబట్టి తెల్ల జుట్టు నల్లగా కావడానికి ఎలాంటి వస్తువులను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఉసిరికాయ 

ఉసిరికాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఈ ఉసిరికాయను ఉపయోగించి జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఉసిరికాయ తెల్ల జుట్టుకు ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మీరు ఉసిరికాయను ఉపయోగించొచ్చు. 
 

ఉసిరి, టీ ఆకులు 

4 నుంచి 5 ఉసిరికాయలను, మూడు టీస్పూన్ల టీ ఆకులను తీసుకోండి. ముందుగా ఉసిరికాయను రాత్రంతా నీళ్లలో వేసి నానబెట్టండి. ఉదయాన్నే ఈ ఉసిరికాయాలను మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో టీ లీఫ్ వాటర్ ను మిక్స్ చేయండి. ఈ నీటిని జుట్టుకు అప్లై చేయండి. ఇలా తరచుగా చేస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది.
 

ఉసిరి, మెహందీ 

4 నుంచి 5 ఉసిరికాయలు, 4 నుంచి 5 గోరింటాకు ఆకులను తీసుకోండి. ఉసిరికాయలను రాత్రి మొత్తం నీళ్లలో నానబెట్టండి. వీటిని ఉదయం మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయండి. దీనిలో  గోరింటాకు ఆకులను గ్రైండ్ చేసి రెండింటిని బాగా కలపండి. ఈ పేస్ట్ ను జుట్టంతా బాగా పట్టించండి. ఈ రెండింటి కాంబినేషన్ మీ జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.

అయితే మీరు మర్చిపోకుండా వారానికి రెండు రోజులు జుట్టుకు నూనెను పెట్టాలి. అలాగే నూనె రాసుకున్న తర్వాత జుట్టును షాంపూతో బాగా క్లీన్ చేయాలి. సరైన షాంపూ, కండీషనర్ ను వాడితేనే మీ జుట్టు నల్లగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. 

జుట్టు రాలడం తగ్గాలంటే ఇలా చేయండి

ఉసిరికాయ, కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది. దీనిలో ఉసిరి పొడి నెత్తిమీద సెబమ్ ఉత్పత్తిని నిర్వహిస్తుంది. అలాగే ఇది దురదను, చుండ్రును తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు నేచురల్ టోనర్ గా కూడా పని చేస్తుంది.

ఉసిరికాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఉసిరికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు మన జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. అలాగే జుట్టును షైనీగా చేస్తాయి.

కొబ్బరి నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు 

కొబ్బరి నూనెలో ఎన్నో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలంగా చేస్తాయి. దనీిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు నెత్తిమీద రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.  అంతేకాదు ఈ నూనె చుండ్రును పోగొట్టడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. జుట్టుకు పోషణను అందించి బాగా పెరిగేలా చేస్తుంది. 
 

జుట్టు రాలకుండా ఉండటానికి ఉసిరి, కొబ్బరి నూనెను ఇలా వాడండి

2 టీస్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని అరకప్పు కొబ్బరినూనెలో వేయండి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద వేడి చేయండి. దీనివల్ల ఉసిరిలోని గుణాలు నూనెలో కలిసిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి.

 దీన్ని తలకు, జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. దీన్ని రాత్రంతా అలాగే వదిలేయండి.  ఉదయాన్నే కెమికల్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు. 

Latest Videos

click me!