నయనతార ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

Published : Nov 09, 2021, 03:00 PM IST

సినిమాల్లో కి వచ్చినప్పుడు నయతార ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు.. మరింత అందంగా కనపడుతోంది. ఆమె తన అందాన్ని, ఫిట్నెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. మరి ఆమె తన అందం, ఫిట్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం..

PREV
19
నయనతార ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?
Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార కి దక్షిణాదిన ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం.. ఆమె మీద నమ్మకంతోనే సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ముందుకు వస్తూ ఉంటారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు నయనతార పెట్టింది పేరు. ఓ వైపు  స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరో వైపు మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ.. దూసుకుపోతోంది.

29

ఇక.. నయనతార పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఆమె డైరెక్టర్ విగ్నేషన్ తో ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి.. పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తైనట్లు సమాచారం.

39
nayanthara

ఈ సంగతి పక్కన పెడితే... సినిమాల్లో కి వచ్చినప్పుడు నయతార ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు.. మరింత అందంగా కనపడుతోంది. ఆమె తన అందాన్ని, ఫిట్నెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. మరి ఆమె తన అందం, ఫిట్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం..

49
Nayanthara

2003లో నయనతార తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఇప్పటికీ వరస సినిమా ఛాన్స్ లు అందుకొని ముందుకు దూసుకుపోతున్నారు. అయితే.. రోజు రోజుకీ ఆమె వయసు తగ్గుతుందా అనే అనుమానం ఎవరికైనా కలగకమానదు. 

59
nayanthara

నయనతార.. తన మజిల్స్ బలంగా ఉంచే వ్యాయామాలు చేస్తుందట. అంతేకాకుండా.. బరువు తొందరగా పెరగకుండా ఉండేందుకు.. ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటుందట.

69
nayanthara

ఇక నయనతార.. ప్రతిరోజూ మర్చిపోకుండా యోగా చేస్తుందట. తన అందానికి యోగా కూడా ఒక కారణమని ఆమె  చెప్పడం విశేషం. ఇంత వ్యాయామంతోపాటు.. ఆమె తన ఆహారం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఎలాంటి పొరపాట్లు చేయకుండా డైట్ ప్లాన్ ఫాలో అవుతుందట.

79

ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, లీన్ మీట్, కోడిగుడ్లను కచ్చితంగా తన డైట్ లో తీసుకుంటుందట.  షూటింగ్స్ లో బిజీగా ఉన్నా కూడా.. తన డైట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదట.
 

89
nayanthara

ఇక ప్రాసెస్డ్ ఫుడ్, పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలకు నయనతార చాలా దూరంగా ఉంటుందట. ఇలాంటి  ఆహారాలను  పొరపాటున కూడా  నయనతార తినదట. వాటికి పూర్తిగా దూరం గా ఉంటుంది.

99
Nayanthara

తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుందట. అందుకోసం.. మంచినీరు ఎక్కువగా తీసుకుంటుందట. దానితోపాటు.. కొబ్బరి నీరు, తాజాగా పండ్ల రసాలను ఆమె ఎక్కువగా తీసుకుంటారట. అంతేకాకుండా తాజా సూప్స్ కూడా తాగుతుందట. వాటితో ఆమె తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందట.

click me!

Recommended Stories