మళయాళ అందం..అనుపమ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

Published : Aug 20, 2022, 03:05 PM IST

ఎక్కువగా సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుంది. తన అందాన్ని పెంచుకోవడానికి ఆమె సహజ ఉత్పత్తులనే ఎక్కువగా ఉపయోగిస్తారట.

PREV
18
 మళయాళ అందం..అనుపమ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

తెలుగు తెరపై వరస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీల్లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. మళయాళం ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ అందం.. ఆ తర్వాత తెలుగులోనూ బిజీగా మారింది.
 

28

ఇటీవలే కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 చిత్రంతో.. అనుపమ మన ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాల్లో అడుగుపెట్టిన మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న అనుపమ ఇప్పుడు.. మరింత నాజుకుగా మారి అలరిస్తోంది. అయితే.. ఆమె అందంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఆ ముఖంలో గ్లో మరింత పెరగడం గమనార్హం.

38

నిజానికి అనుపమ నేచురల్ బ్యూటీ. ఓవర్ మేకప్ ని ఆమె అస్సలు ఇష్టపడదు. ఎక్కువగా సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుంది. తన అందాన్ని పెంచుకోవడానికి ఆమె సహజ ఉత్పత్తులనే ఎక్కువగా ఉపయోగిస్తారట.

48
anupama

అనుపమ సహజంగా తయారు చేసిన ఓ బ్యూటీ ప్యాక్ ని తన ముఖ సౌందర్యానికి ఉపయోగిస్తారట. మరి ఆ బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం...
 

58

అనుపమ కాఫీ , తేనె కాంబినేషన్ తో  తయారు చేసిన సహజ ఫేస్ ప్యాక్ ని తన స్కిన్ కోసం ఉపయోగిస్తారట. దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

68
Anupama Parameswaran

రెండు స్పూన్ల కాఫీ పొడికి, రెండు స్పూన్ల తేనె కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి , మెడకు రాసి.. ఆ తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా రాసిన తర్వాత 15 నిమిషాల పాటు ఆగి.. ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి.

78
Anupama Parameswaran

అనుపమ ఆరోగ్యానికి, ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలుు తీసుకుంటుంది. ప్రతిరోజూ ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉంటారు.  ఆ వర్కౌట్స్ కూడా ఆమె గ్లో తీసుకువస్తుంది.

88

ఆమె తన చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడానికి.. తరచూ మంచినీరు తాగుతూ ఉంటుందట. కేవలం మంచి నీరే కాకుండా..జ్యూస్, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఇవి కూడా ఆమె చర్మానికి మరింత గ్లో తీసుకువస్తాయి.

 

click me!

Recommended Stories