మీ టెన్షన్స్ ను తగ్గించే 5 ఈజీ టిప్స్: ట్రై చేయండి

First Published Aug 21, 2024, 11:48 PM IST

ఈ బిజీ లైఫ్ లో టెన్షన్ పడని రోజంటూ ఉంటుందా చెెప్పండి.. ప్రతి పని ఆందోళన పడకుండా చేయడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో ఉన్న మీకు సహాయపడే 5 ఈజీ అండ్ సింపుల్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. 

మీరు బలవంతుడని నమ్మండి

"నేను నా ఆందోళన కంటే బలవంతుడిని. అది నన్ను నియంత్రించలేదు. నా ఆలోచనలు, చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను. నేను ప్రశాంతత, శాంతిని కోరుకుంటున్నాను. నా జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెడతాను. నేను ఉద్రిక్తతను వదులుకుంటాను. నాలో ఉన్న భయాలను తరిమేస్తాను."

మీ సామర్థ్యాన్ని గుర్తించండి

"నా జీవిత పయనంలో నాకు ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేను కలిగి ఉన్నాను. నేను పడే ఆందోళన నా అనుభవంలో ఒక చిన్న భాగం మాత్రమే.. నాలోని దయాగుణాన్ని, బలాన్ని పెంచుకొని ప్రయాణం కొనసాగిస్తాను. నా సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాను. సవాలుతో కూడిన పరిస్థితుల నుండి ఎక్కువ జ్ఞానం పొందుతాను."

Latest Videos


ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి

"నేను ప్రశాంతంగా, హాయిగా ఉండగలను. నా ఆందోళనను పెంచే అపరాధ భావన, అవమానం వంటి భావాలను వదిలేస్తాను. నేను మనిషి అని గుర్తుంచుకుంటాను. ఎందుకంటే మనుషులు జాలి, దయ కలిగి ఉండాలి. ఉంటారు. నేను కూడా  ఆ లక్షణాలను వదులుకోను."

మీ ఆలోచనలను నియంత్రించండి..

"నేను నా ఆలోచనలను నియంత్రించ గలను. నా శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే ఆలోచనలను పెంచుకుంటాను. తాత్కాలికమైన నా చింతలు, భయాలను వదిలేస్తాను. ఆకాశం లాంటి నా మనస్సులో మేఘాలు పరుగులు పెట్టడాన్ని నేను గుర్తించాను. నేను ప్రస్తుత క్షణంపై మాత్రమే దృష్టి పెడతాను. నా మనస్సును శాంతి వైపు మళ్లించే శక్తి నాకు ఉంది."

ప్రతిదీ సరిగ్గానే ఉంటుందని నమ్మండి

"ప్రతిదీ ఎలా జరగాలో అలాగే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎంత చిన్నదైనా ప్రతి అడుగు ముందుకు, పురోగతి వైపు వేస్తాను. నేను నాతో నా ప్రయాణం ఓపికతో చేయగలను. ప్రతిదీ నియంత్రించాల్సిన అవసరాన్ని నేను వదులుకుంటాను."

click me!