ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ మొదలౌతోంది. మొన్నటి వరకు మూఢాలు.. మంచి ముహూర్తాలు ఏమీ లేకపోవడంతో.. చాలా మంది పెళ్లి కన్ఫామ్ అయినా.. మంచి ముహూర్తాల కోసం వెయిట్ చేశారు. ఈ నెలాఖరు నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కావడంతో.. పెళ్లికి సంబంధించిన షాపింగ్ మొదలుపెడుతున్నారు.
undefined
మీరు కూడా ఈ ఎండాకాలం పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే... అందులోనూ ఫ్యాషన్ ప్రియులైతే.. ఈ వెడ్డింగ్ జ్యువెలరీ కచ్చితంగా ఎంచుకోవాల్సిందే. ఇప్పటికే.. పెళ్లికి సంబంధించి జ్యువెలరీ షాపింగ్ మొదలుపెట్టినట్లయితే.. ఇదిగో.. ఈ ట్రెండీ.. ఫ్యాషనబుల్ జ్యువలరీ ఎంచుకోండి.
undefined
1. ఎనామెల్డ్ జుమ్కి చెవిపోగులు ఎలాంటి దుస్తులు వేసుకున్నా.. చెవి పోగులు పెట్టుకుంటే వచ్చే అందమే వేరు. ఆ చెవి పోగుల్లోనూ జుమ్కాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటివారికైనా ఇట్టే నప్పేస్తాయి. అందులో కొత్తగా ట్రెండీగా మార్కెట్లోకి అడుగుపెట్టినవే ఈ ఎనామెల్డ్ జుమ్కి చెవిపోగులు. బుట్టల మాదిరిగా.. వేలాడుతూ ఉండే.. ఈ చెవిపోగులు.. చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. ఎంత పెద్దవి పెట్టుకున్నా.. అందాన్ని పెంచుతాయే గానీ.. మనకు బరువుగా మాత్రం అనిపించవవు. దాని వల్ల అందంగా మెరిసిపోతాం.. వాటిని పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. లెహంగా డ్రెస్ కి ఇవి బాగా నప్పుతాయి,
undefined
2.పూల డిజైన్ తో బంగారం, డైమండ్ చాంద్ బాలీలు.. పెళ్లిలో ఎవరైనా సంప్రదాయంగానే కనిపించాలని ఆశపడుతుంటారు. ఈ సంప్రదాయ లుక్ ని చాంద్ బాలీలు మనకు తీసుకువస్తాయి. అందులోనూ ఈ మధ్య ఈ చాంద్ బాలీలకు అదనపు ఆకర్షణగా పువ్వుల డిజైన్లు వస్తున్నాయి. అనార్కలీ సూట్, చీర, లెహంగా ఇలా ఏది ధిరించినా.. వాటికి చాంద్ బాలీలు చక్కగా నప్పుతాయి.
undefined
3.కుందన్ మీనా నెక్లెస్ సెట్ మెడలో ఒక కుందన్ నక్లెస్ పెట్టుకుంటే వచ్చే హుందానే వేరు. రాయల్ లుక్ లో కనిపించాలని అనుకునేవారు.. ఈ కుందన్ నెక్లెస్ సెట్ ని ఎంచుకోవచ్చు. ఈ నక్లెస్ సెట్ మెడలో పెట్టుకుంటే నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి. కేవలం పెళ్లి కూతురు మాత్రమే కాదు.. పెళ్లికి వచ్చే బంధువులు సైతం దీనిని ఎంచుకోవచ్చు. మెడలో ఒక్కటి పెట్టుకుంటే.. మరే ఇతర నగ అవసరం రాదు. దీనిలో ప్రస్తుతం విభిన్న రకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
undefined
4.పోల్కి చోకర్ నెక్లెస్ చోకర్.. ఈ మధ్యకాలంలో ట్రెండీగా మారిన నక్లెస్ అని చెప్పొచ్చు. ఈ చోకర్ లోనూ విభిన్నరకాలు ఉన్నాయి. మొన్నటి వరకు కేవలం బంగారం, డైమండ్స్ తో చోకర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మెరిసే రాళ్లు, ముత్యాలతో ట్రెండీ చోకర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ట్రెండీగా.. ఇటు సంప్రదాయాన్నీ.. అటు వెస్ట్రన్ గానూ కనిపించడానికి వీటిని ఎంచుకోవచ్చు.
undefined
5.డబల్ ఫింగర్ రింగ్ మహిళలకు ఎన్ని ఆభరణాలు ఉన్నా.. చేతులకు ఉంగరాలపై ఎక్కువ ఫాంటసీ ఉంటుంది. ఎన్ని రకాలు ఉన్నా.. కొత్త రకం రింగ్ కనిపించగానే కొనేయాలనే కోరిక కలుగుతుంది. అలాంటి వారి కోసం.. తాజాగా మార్కెట్లోకి డబల్ ఫింగర్ రింగ్ లు అడుగుపెట్టాయి. ఒక్క వేలికి రింగ్ పెట్టుకున్నా.. అది రెండు వేళ్లను కవర్ చేస్తుంది. దీనిని మీరు కూడా ప్రయత్నించవచ్చు. చాలా స్టైలిష్ గా ఉంటాయి.
undefined