ఈజీగా చీరను హ్యాండిల్ చేయాలా..? సింపుల్స్ టిప్స్ ఇవే..!

First Published | Feb 26, 2021, 3:53 PM IST

 చీర కట్టుకుందామా అంటే.. దానిని హ్యాండిల్ చేయడం రాక తిప్పలు పడాల్సి వస్తోంది. మరి ఈజీగా చీరను హ్యాండిల్ చేయడం ఎలా..? అంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. 

భారత సంప్రదాయంలో చీరది కీలక పాత్ర. ఇంట్లో శుభకార్యం, పెళ్లి, ఫంక్షన్ ఇలా ఏది వచ్చినా.. అమ్మాయిలు చీర కట్టుకోవడం తప్పదు. అలా కాకుండా డ్రెస్సులు వేసుకుంటే.. ఇక అమ్మ చేతిలో తిట్లు తప్పవు.
మరి అలా అని చీర కట్టుకుందామా అంటే.. దానిని హ్యాండిల్ చేయడం రాక తిప్పలు పడాల్సి వస్తోంది. మరి ఈజీగా చీరను హ్యాండిల్ చేయడం ఎలా..? అంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

1.చీర కట్టుకోవడానికి మందు.. ఎలాంటి చీర అయితే.. సింపుల్ గా హ్యాండిల్ చేయగలం అనే విషయంలో క్లారిటీ ఉండాలి. ఎలాంటివారైనా కాస్త లైట్ వెయిట్ గా ఉండే చీరలను ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ మధ్యకాలంలో ఆర్గంజా చీరలు ట్రెండీగానూ.. చాలా లైట్ వెయిట్ గానూ లభిస్తున్నాయి. కాబట్టి వాటిని ట్రై చేయవచ్చు.షిఫాన్ చీరలు కూడా హ్యాండిల్ చేయడం సులువు.
2.చాలా మందికి చీర కుచ్చీలు పోసుకోవడం రాదు. దానితోనే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అయితే... ఈ మధ్యకాలంలో కుచ్చీలు పోసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఆల్రెడీ ఉన్నవే మార్కెట్లో లభిస్తున్నాయి. వాటినే ప్రీ ప్లీట్ సారీ అంటారు. వాటిని మన నడుముకు సరిపోయేలా చూసుకోని కట్టుకుంటే సరిపోతుంది. ఇవి కూడా క్యారీ చేయడం చాలా సులువు.
3.చీరకు పిన్నులు కూడా చాలా అవసరం. చీర కట్టుకోవడం మొదటి సారైతే.. ఎక్కడికక్కడ చీర జారకుండా పిన్స్ పెట్టుకోవడం ఉత్తమం. అలా పిన్స్ పెట్టుకోవడం వల్ల చీర జారుతుందనే భయం ఉండదు. అప్పుడు మనం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాం.
4.ఇక చీర ఏది ఏంచుకున్నా.. ముందుగా దానికి తగిన బ్లౌజ్ ఎంచుకోవడం కీలకం. చీరకు బ్లౌజ్ వల్లనే ఎక్కువ అందం వస్తుందన్న విషయం మర్చిపోవద్దు. ప్రస్తుత కాలంలో.. రెడీమెడ్ బ్లౌజెస్ కూడా లభిస్తున్నాయి. వాటి వల్ల చీరకు మరింత అందం చేకూరి.. మీరు స్పెషల్ గా కనిపిస్తారు.
5. ఇక చివరగా.. చీరకింద ధరించే పెట్టికోట్ కూడా చాలా ముఖ్యం. సరైన పెట్టికోట్ ధరించే.. మీ షేప్ కూడా చీరకు నప్పే విధంగా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సారీ షేపర్ పెట్టికోట్స్ లభిస్తున్నాయి. వాటిని ధరించి.. ఆ తర్వాత చీరకట్టుకుంటే.. చాలా అందంగా కనిపిస్తారు.

Latest Videos

click me!