డోర్ మ్యాట్
ప్రతి ఒక్కరి ఇంట్లో డోర్ మ్యాట్ లు ఖచ్చితంగా ఉంటాయి. వీటిని గుమ్మం ముందు ఉంచడం వల్ల ఇంట్లోకి వెళ్లేటప్పుడు ప్రతిసారీ మన కాళ్లకు అంటిన దుమ్మును తుడుస్తుంటాం. అలాగే కాళ్లను కడిగిన ప్రతిసారీ వీటికి దుమ్ము, ధూళి కూడా ఎక్కువగా పట్టుకుంటాయి. దీంతో ఇవి చాలా తొందరగా మురికిగా అవుతాయి.
డోర్ మ్యాట్స్
వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే మాత్రం చాలా మురికిగా అవుతాయి.ఇలాంటి వాటిని వాష్ చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. నిజానికి చాలా మంది ఆడవారు డోర్ మ్యాట్ ను చేతితోనే శుభ్రం చేయాలని అంటుంటారు. కానీ వీటిని వాషింగ్ మెషిన్ లో కూడా వేయొచ్చు.
వీటిని క్లీన్ చేయడం చాలా సులువు కూడా. ఇందుకోసం ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లలో వాషింగ్ పౌడర్ ను వేసి అందులో డోర్ మ్యాట్‌ని 15-20 నిమిషాల పాటు నానబెట్టండి. దీంతో డోర్ మ్యాట్ కు పట్టిన మురికి మొత్తం వదులుతుంది. ఆ తర్వాత దీన్ని రెండుసార్లు నీళ్లతో శుభ్రం చేసి వాషింగ్ మెషిన్‌లో వేస్తే మీ డోర్ మ్యాట్ కొత్తదానిలా మెరిసిపోతుంది.
జుట్టుకు కలర్ ఎక్కువగా వేస్తే ఏమౌతుందో తెలుసా?
డోర్ మ్యాట్స్
అయితే డోర్ మ్యాట్ శుభ్రం చేయడానికి ముందు దానికి పట్టుకున్న దుమ్మును, దూళిని, మురికిని దులపాలి. అలాగే నీళ్లలో నానబెడితే ఆ దుమ్ము డోర్ మ్యాట్ లోనే ఉండిపోతుంది. అందుకే దీన్ని నానబెట్టడానికి ముందు బాగా దులిపి కొంచెం సేపు ఎండలో ఉంచండి. ఆ తర్వాత నీళ్లలో నానబెట్టండి.
వినిగర్
వెనిగర్ తో డోర్ మ్యాట్ ను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లలో వెనిగర్ ను కలపండి. అయితే వాటర్, వెనిగర్ సమానంగా ఉండాలి. దీన్ని డోర్ మ్యాట్ పై స్ప్రే చేయండి. దీంతో మురికి వదిలిపోతుంది. ఆ తర్వత దీన్ని మీరు చేతితో లేదా వాషింగ్ మెషిన్ లో క్లీన్ చేయొచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్
హైడ్రోజన్ పెరాక్సైడ్ తో డోర్ మ్యాట్‌ని క్లీన్ చేస్తే దానికి అంటుకున్న మురికి మొత్తం లేకుండా పోతుంది. ఇందుకోసం సమానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లను సమానంగా తీసుకుని డోర్ మ్యాట్ పై స్ప్రే చేయండి. దీన్ని కొన్ని నిమిషాలు నానబెట్టి స్క్రబ్బర్ తో దుద్ది క్లీన్ చేయండి.
డోర్ మ్యాట్ వాషింగ్ 2 - 3 రోజులు
మీ ఇంట్లో పిల్లలుంటే మాత్రం రెండు రోజులకోసారి డోర్ మ్యాట్‌ని క్లీన్ చేయండి. లేదా మార్చండి. బాత్రూమ్‌కి వెళ్లొచ్చాకా కాళ్లను కడిగి మ్యాట్ పై రుద్దితే దానిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే కాళ్లకు మురికి పట్టకుండా చూసుకోవాలి. అలాగే ఖచ్చితంతగా వీటిని రెండు మూడు రోజులకోసారి శుభ్రం చేస్తుండాలి.