Your Weekly Horoscopes: ఈ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతి,. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది

Published : Mar 03, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ వారం అన్ని రంగాల వారికి  కలిసి వస్తుంది.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీ.కుటుంబ వృద్ధి చెందుతుంది

PREV
113
Your Weekly Horoscopes: ఈ రాశి వారికి   ఉద్యోగాల్లో పదోన్నతి,. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది
astrology

వార ఫలాలు : 03 -3-2024 నుండి 09-3 -2024  వరకు
 
  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు.తలపెట్టిన కార్యక్రమం పట్టుదలతో పూర్తి చేస్తారు.సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.రుణ శత్రు బాధలు ఇబ్బంది పెడతాయి.బంధుమిత్రులతో చికాకులు. వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికమగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.స్థిరాస్తి కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అన్ని రంగాల వారికి  కలిసి వస్తుంది.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీ.కుటుంబ వృద్ధి చెందుతుంది. శత్రువుల పై పైచేయి సాధిస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు.బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. మంచి పనుల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో  అధికారుల మన్ననలను పొందుతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారం అనుకూలంగా మార్చుకుంటారు.ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సానుకూలం.గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది.ఆకస్మిక ధన లాభం.కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. అన్నదమ్ములు సహకారం లభిస్తుంది. శత్రు బాధలు తగ్గుతాయి.

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల కలయిక.సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మిత్రుల యొక్క ఆదరణ పొందుతారు.పోయిన ధనాన్ని తిరిగి లభించును.ఇతరులకు సహకారం చేసే మనస్తత్వం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్.

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
సామాన్యంగా జీవన విధానంగా గడుపుతారు.రావలసిన బాకీలు లో జాప్యం జరుగుతుంది.స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.అవసరాలకు ధనం చేకూరుతుంది.కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.అధికారులు తో ఇబ్బందులకు గురి అవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల లో ఆచి తూచి వ్యవహరించాలి.మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఆదాయ మార్గాలు సామాన్యంగా ఉంటాయి. ప్రాంతంలో ఆర్థిక పరమైన చిక్కులు. రుణాలు చేయవలసి వస్తుంది.శుభ కార్యాచరణ వలన ధనవ్యయం.గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన పౌరుషాల దూరంగా ఉండాలి.నూతన సమస్యలు ఏర్పడును.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనుల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకోక పోవడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అన్నదమ్ములు మిత్రులతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి.శారీరక శ్రమ పెరుగుతుంది. భూ గృహ విక్రయాలు వాయిదా వేసుకుంటే మంచిది.

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు పదోన్నతులు బదిలీలు విషయంలో అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.నూతన ఆలోచనలు చేస్తారు.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. అన్నదమ్ముల సహాయసహకారాలు అందుకుంటారు.ఆకస్మిక ధన లాభం.ప్రయాణాలు లాభిస్తాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు.తలపెట్టిన కార్యక్రమం పూర్తి చేస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.గృహమునందు సంతోషకరమైన వాతావరణం.

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
శారీరక కష్టం.ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువు రుణ బాధలు పెరుగుతాయి.సంఘంలో చికాకులు. గృహంలో ప్రతికూల వాతావరణం. వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటాయి.జీవన విధానం సాఫీగా సాగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు రాగలవు.సంఘంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గృహంలో పెద్ద వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగ పదోన్నతులు బదిలీలు పట్టుదలతో సాధించవచ్చును.

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకున్న పనుల్లో జాప్యం జరిగిన పట్టుదలతో పూర్తి చేస్తారు.
ఆదాయ మార్గాలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందుతారు.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తూ కార్యాలను చక్కబెట్టు కుంటారు.సత్కర్మలు చేస్తారు.అన్నదమ్ముల ఆదరణ లభిస్తుంది.స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్త వింటారు.

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
రుణ సమస్యలు కొంత వరకు ఉపశమనం కలిగించును.సంఘంలో గౌరవం తగ్గుతుంది.వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి. తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేయాలి.ఉద్యోగులకు స్థానచలనం. చేతివృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికమగును.స్థిరాస్తి క్రయ విక్రయాల లో ఆచితూచి వ్యవహరించాలి. కొంతమేర ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం.కొంత వరకు రుణం చేయవలసి రావచ్చు.అనుకున్న పనులు లో జాప్యం జరుగుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించాలి.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సుఖ జీవనం సాగిస్తారు.అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.సంతాన మూలకంగా లాభం.పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.ఆస్తి విషయంలో ఏర్పడిన చికాకులు తొలగును.ఉద్యోగాలలో అధికారులు మన్ననలను పొందుతారు. సంఘంలో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు తొలగి ఆనందంగా గడుపుతారు.రుణ శత్రు బాధలు ఉన్నప్పటికీ అంతగా బాధించవు.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది.
అనుకూలమైన జీవన విధానం సాగుతుంది.కొంతకాలంగా ఇబ్బంది  పెడుతున్న  సమస్యలకు పరిష్కార మార్గం లభించును.

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

రుణబాధలు తొలగు తాయి.శత్రువులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది.సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.కుటుంబంలో సమస్యలు తొలగుతాయి.అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.బుద్ధి చాతుర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అధికారుల ద్వారా లాభం చేకూరును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి.ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ వృద్ధి.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతాయి.ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.ఉద్యోగస్తులకు స్థానచలనం.శారీరక శ్రమ పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.జీవన విధానం సాఫీగా ఉండును. కష్టనష్టాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు.రుణబాధలు కొంతవరకూ తీరును.. బంధుమిత్రులతో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు.జీవిత భాగస్వామితో ప్రతికూలమైన వాతావరణం. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు,ఆదాయ మార్గాలు కలిసి రాకపోవడంతో ఆవేదనకు గురి అవుతారు.అనవసరమైన ఖర్చు చేయాల్సి వస్తుంది.  ప్రయాణాలలో చోర భయం.

click me!

Recommended Stories