Your Weekly Horoscopes: ఈ రాశి వారు వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదురుతుంది

Published : Feb 25, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ వారం ఓ రాశివారు గతంలో పడిన శ్రమకు ప్రతిభా పురస్కారాలు పొందుతారు. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.ప్రతి విషయం జాగ్రత్తగా ఆలోచించి చేయవలెను.ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.   

PREV
113
Your Weekly Horoscopes: ఈ రాశి వారు  వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదురుతుంది

వార ఫలాలు : 25 -2-2024 నుండి 02-3 -2024  వరకు
 
  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులుతో  వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. సమాజంలో  ఆగ్రహ వేషాలు తగ్గించుకుని వ్యవహరించాలి.తోటి వారితో మైత్రి భావన తో సఖ్యత గా ఉంటూనే పనులు పూర్తి చేయాలి.ఋణ బాధలు ఏర్పడగలవు.శుభకార్య ప్రయత్నాలు పట్టుదలతో చేయవలెను. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకోవడం కష్టం గా ఉంటుంది. ఉద్యోగం విషయంలో అధికారులు తో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా ధనం వృధాగా ఖర్చు చేస్తారు.

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
కోపావేశము తగ్గించు కావాలి.సాంఘిక కార్యక్రమాలు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొన్ని  సమస్యల వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు.సమాజంలో అవమానాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులుతో తరచు మాట పట్టింపులు విరోధాలు ఏర్పడగలవు.ఆదాయ మార్గాలు తగ్గడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు సరిగా నిర్వహించలేక ఇబ్బందులు పడతారు.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరిగి చిరాకు  అసంతృప్తి కలుగుతుంది. వ్యవహారాలలో పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి.

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
గతంలో పడిన శ్రమకు ప్రతిభా పురస్కారాలు పొందుతారు. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.ప్రతి విషయం జాగ్రత్తగా ఆలోచించి చేయవలెను.ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. తలపెట్టిన పనులు అనుకూలంగా జరుగును.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక ఆదాయం మార్గాలు అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కగా నిర్వహిస్తారు. ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు కేసులు మరియు వివాదాలకు పరిష్కార మార్గాలు దొరుకును.విద్యార్థులకు అనుకూలం.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
కుటుంబ విషయాల గురించి భార్య పుత్రులు తో కలహాలు ఏర్పడవచ్చు. శుభకార్యాల ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉంటాయి. రుణదాతలు నుండి అవమానములు జరగవచ్చు. మానసికంగా తెలియని ఒత్తిడికి చికాకులకు లోనవుతారు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిస్తేజంగా నుండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఓర్పు సహనం అవసరం.స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడిన చివరకు అన్ని పనులు సానుకూలం అవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు లో  జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
విలాసవంతమైన వస్తువులు కొనుగోలు యందు జాగ్రత్త అవసరం. బంధుమిత్రులు మీ అవసరానికి అనుగుణంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలు లో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యం గాని లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.గత సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నాలు మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది.వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తి కాగలవు‌. సమాజంలో బహుమానాలు సన్మానాలు  పొందగలరు.

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఉద్యోగాలలో  అధికారుల ద్వారా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండవలెను.వృత్తి వ్యాపారాలు చికాకులు గా ఉంటుంది.కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్య ప్రయత్నాలలో అవాంతరాలు ఏర్పడతాయి.నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం.వాగ్దానాలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బద్ధకము అలసత్వం వల్ల వచ్చే అవకాశాలను చేజారుస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును.ప్రయత్నించిన ప్రతి విషయంలోను విజయం సాధిస్తారు. ఉద్యోగ విధి నిర్వహణ అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో  అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును.గత కొంతకాలంగా నిలిచిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ధనధాన్యాది లాభం చేకూరును.

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.  అభివృద్ధి ప్రయత్నాలలో తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన  ప్రతిఫలం లభిస్తుంది. దురాలోచన అసూయ లకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు గా సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో పెద్ద వారి  సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు.

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
రుణాల విషయంలో జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి గాక వల్ల ఇబ్బందులు పడతారు.దూర ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.అవసరానికి ధనం ఏదో విధంగా సర్దుబాటు జరుగుతుంది.ఆరోగ్య ప్రతిబంధకాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.వ్యవహారములో ఆటంకాలు ఏర్పడును.బంధుమిత్రులతో కలహాలు రాగలవు.కుటుంబ సభ్యులు తో సమస్యలు ఎదురవగలవు.ఉద్యోగాలలో సహోద్యోగులు వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. ఇతరులతో కలహాలకు వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ విషయాలు ఇబ్బందికరంగా ఉండును. ఖర్చు విషయంలో నియంత్రణ అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలు నిబద్ధతతో చేయాలి. సంఘంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.కుటుంబ బాధ్యతలు సక్రమంగా అమలు చేయడానికి సరైన ప్రణాళిక అవసరం.శారీరక మానసిక చికాకులు అధికమవుతాయి. రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇష్టం లేని చోట ఉండడం అయిష్టత భోజనం చేయవలసి వస్తుంది.కొన్ని విషయాలు మానసిక ఉద్రేకాలకు దారితీయును.

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును. దీర్ఘాలోచన తో చేసిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించును. ఋణ సమస్యలు ఉన్నవారికి రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. శుభకార్య ప్రయత్నాలు చేయువారు శుభవార్తలు వింటారు.వ్యవహారాలలో మరియు విరోధాలు విషయంలో ఇతరుల సలహాలు సూచనలు పొందగలరు. ఆర్థిక విషయాలలో చక్కటి తెలివితేటలతో ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
తలచిన కార్యాలు లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో  ఊహించని ధన లాభం పొందుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలంకార వస్తువులు గృహోపకరణ వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా నుండును. వివాదాలు కీలకమైన సమస్య పరిష్కారం అవును.సమాజంలో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

click me!

Recommended Stories