Daily Horoscope
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలలో తెలుసుకుందాం
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
వృత్తి వ్యాపారాలు మందకొడిగా నడుచును. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరము. అతి కష్టం మీద తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజము నందు ఆచితూచి మాట్లాడవలెను. మానసిక శారీరక బాధలు ఏర్పడగలరు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. విరోధాలకు కలహాలకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు మానసిక ఉద్రేకాలకు దారి తీయును. స్థిరాస్తులలో మార్పులు ప్రతికూలంగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. వృత్తి ఉద్యోగంలో అనుకూలతలు తక్కువుగా నుండును. వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. సమస్యాత్మక అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
గృహమున కళ్యాణాది శుభ కార్యక్రమాల యోగం. కుటుంబ విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన వస్తు వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలను నుండి బయట పడతారు. మిత్రులతోటి అనందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ అన్వేషణ మార్గాలు పెరుగుతాయి. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. రావలసిన ధనము కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన చివరకు లభిస్తుంది. ఉద్యోగమునందు ఉన్నత స్థితి పొందగలరు. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రయాణా లాభిస్తాయి. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు ఉన్నటువంటి చికాకుల తొలగి లాభసాటిగా ముందుకు సాగుతారు. కేసులకు సంబంధించి తీర్పులు అనుకూలంగా ఉండును. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయాలు అనుకూలం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకునుట మంచిది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర, సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి. తీర్పులు, కేసులు మానసిక ఒత్తిడిలు పెంచును. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . చేయు పని యందు ఓర్పు, సహనం అవసరం. సమాజం నందు అపనిందులు ఏర్పడగలవు. అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పగ ప్రతీకారాలకు దూరంగా ఉండండి. వ్యాపారం నందు లాభాలు కష్టపడి సాధించవలసిన పరిస్థితి. కుటుంబము నందు ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకొని వలెను. చిన్న కారణాలు పెరిగి పెద్దవై భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా చికాకులు ఏర్పడతాయి. చదువు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సంఘములో పరిస్థితులు మనోవేదనకు కారణం అవుతాయి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును.ఆదాయ మార్గాలు తగ్గును. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. చేయి ఖర్చులు ఆచూతూచి చేయవలెను.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకోవడం మంచిది. శ్రమకు తగిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి. తీర్పులు కేసులు మానసిక ఒత్తిడిలు పెంచును. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . చేయ పని యందు ఓర్పు సహనం అవసరం. సమాజం నందు అపనిందులు ఏర్పడగలవు. అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అనుకోని కారణాల చేత సమాజము నందు మీ పరపతి తగ్గును. ఆత్మీయుల చేత మనస్పర్ధలు ఏర్పడతాయి. సమస్యల యందు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను. నిష్కారణమైన తగాదాలు కలహాలు ఏర్పడవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. గృహము సంతానము నందు ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తగు సమయానికి ఏదో ఒక రకంగా ధనం చేతికందుతుంది. మిత్రుల వలన కొంత పెడదోవ పట్టే అవకాశం ఉంది. కేసులు యందు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిరాకు పుట్టించును. కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన సంభాషణలతోటి కాలయాపన చేస్తారు. ఆచితూచి ఖర్చు చేయవలెను. ఉద్యోగమునందు అధిక ఒత్తిడికి గురికావడం జరుగుతుంది
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఉద్యోగ సంభంధమైన విషయాలలో మంచి మార్పులు రావచ్చును. నూతన వస్తు, వాహనాన్ని కొనుగోలు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి బంధుమిత్రులతో కలిసి చర్చిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు అందిస్తాయి. వృత్తి వ్యాపారము నందు మంచి లాభాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మొండి బాకీలు లౌక్యం తోటి వసూలు చేసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు బాగా రాణిస్తారు. సమస్యల విభేదాలు వివాదాలకు దారితీయును. జాగ్రత్త అవసరం. ఉద్యోగమునందు మీ సమర్థతను నిరూపించుకుంటారు. సహోదర సహోదరీ వర్గం తోటి సంబంధాలు బలపడతాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల మీద ద్వేష అసూయాలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు విపత్తులు ఏర్పడవచ్చు. వ్యక్తిగత సమస్యల వలన మనసు నందు బాధ ఏర్పడును. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. వచ్చిన అవకాశాల్ని అహంభావంతోటి లేదా కోపంతో వదులుకుంటారు. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలు మందగమనంతో నడుస్తాయి. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు దీర్ఘాలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకొనవలెను.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయవృతి వ్యాపారమునందు అభివృద్ధి చెందుతాయి. వారాంతములో ఆకస్మిక ధన లాభం కలుగును. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను పొందుతారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మనసునందు ఉన్న ఆలోచనలు ఆచరణలోకి తీసుకుని వస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వివాదాలు కోర్టు కేసులు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టుదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాదాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును.
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వారాంతంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. రావలసిన బాకీల వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రావచ్చును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును. కొత్త పరిచయాలతోటి సమస్యలు పరిష్కారం అగును. కుటుంబ సౌఖ్యం లభించును. అనారోగ్య సమస్యలు తీరి దేహారోగ్యం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అకారణంగా నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరిగి శరీరానికి ప్రశాంతత లోపిస్తుంది. రావలసిన బాకీల్లో స్తబ్దత ఏర్పడుతుంది. సెటిల్మెంట్ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయవలెను. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చును. సోదర సోదరీల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. కుటుంబ సభ్యులకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండను. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయటం మంచిది. శత్రువుల తోటి అపకారం పొంచి ఉన్నది.