
ఈ వారం ఆశాజనకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఈవారం కొన్ని ప్రయాణాలు ఉంటాయి. గృహ భూ క్రయ విక్రయముల యందు లాభం. వృత్తి వ్యాపారాల యందు కలిసి వచ్చును. ఆనందంతో గడుపుతారు. ఒంట్లో కొద్దిగా నలతగా, బద్ధకం గా ఉండును. కొన్ని సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాలు తీరుస్తారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఈ వారమంతా రోజూ ఓం నమశ్శివాయ అని మంత్రమును 21సార్లు పఠించిన శుభం జరుగును.
సంఘంలో గౌరవం,బలం. ఉన్నత విద్య. అనుకున్న పనులు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. కుటుంబ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశివారు ఈ వారమంతా రోజు ఓం శనైశ్చరాయ నమః అను మంత్రమును 21 మార్లు పఠించిన శుభం జరుగును.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. భూ,గృహ క్రయవిక్రయాల యందు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. ఒత్తిడి తగ్గి కుదుటపడాలి. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడే సమయం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. విద్యార్థులు కష్టపడిన ఫలితం బాగుండును. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ధన నష్టం. ఈ రాశివారు ఈ వారమంతా ఓం బృహస్పతయే నమః అను మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
చేయు పనులయందు లాభం. సంతోషంగా గడుపుతారు. భూ గృహ క్రయ విక్రయాల యందు లాభం. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు అనుకూలం. కుటుంబంలో ఇబ్బందులు. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.ఈ రాశి వారు ఈ వారమంతా రాహవే నమః పని మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అతి కష్టం మీద పనులు పూర్తగును.భూ గృహ క్రయవిక్రయాల యందు ఆలోచన అవసరం. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. కుటుంబంలో చిక్కులు. మానసిక ఒత్తిడి. విద్యార్థులు ఈవారం కష్టపడవలెను. . పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహంలభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పోటీ ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఈ వారం అంతా రోజు ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును
ఈ వారం అన్ని రంగాల వారికి శుభదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం. అనుకున్న పనులు పూర్తవుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు. ధనలాభం. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. శుభకార్యములు. విద్యార్థులకు అనుకూలం. ఈ రాశివారు ఈ వారం అంతా రోజు ఓం మహాలక్ష్మి నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును
ఈ రాశి వారికి ఈ వారం జాగ్రత్త అవసరం. కుటుంబంలో గొడవలు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్య, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాల యందు మోసపోయే అవకాశం జాగ్రత్త వహించవలెను. కుటుంబం గురించి ఆలోచన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఈ రాశివారు ఈ వారమంతా ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును
చేయి పనుల యందు అభివృద్ధి కనబడును. సంతోషంగా గడుపుతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆకస్మిక ధన లాభం. సంతానం మూలంగా సంతోషం. పోగొట్టుకున్న వస్తువు దొరుకుట. మొండి బకాయిలు తీరుట. విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఈ రాశివారు ఈ వారమంతా ఓం శనైశ్చరాయ నమః అను మంత్రమును రోజు 21 మార్లు జపించిన శుభం జరుగును.
సంఘంలో గౌరవం. రావలసిన ధనం తిరిగి వచ్చును. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలంగా లేదు. ఒక ఆహ్వానం ఉత్సాన్నిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన పదవులు దక్కవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వేడుకకు హాజరవుతారు. వృత్తివ్యాపారాలు సంతృప్తినిస్తాయి. మిత్రుల సహకారంతో ధనాధాయ మార్గములు కనబడుట. దాంతో వృత్తి వ్యాపారాలు లాభం. అధిక ఖర్చు. విద్యార్థులకు అనుకూలం. ఈ వారం అంతా ఈ రాశివారు ఓం బృహస్పతయే నమః అను మంత్రమును రోజు 21 సార్లు జపించిన శుభం జరుగును.
వ్యవహార విషయంలో జాగ్రత్త అవసరం. ధన నష్టం. కష్టపడిన చదివిన విద్యార్థులకు అనుకూలం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంతానం మూలంగా ఖర్చు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు కలసి రాకపోవట. తెలివిగా వ్యవహరించవలెను. ఈ రాశి వారికి లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం..నెరవేరుతుంది. స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే విశేషంగా కలిసి వస్తుంది.
ఈ వారం జయం, ధనలాభం వున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవ, ప్రతిష్టలు. ధనలాభం. ఉద్యోగ వ్యాపారాలు విశేషంగా ఉండును. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు అభినందనలు తెలియజేస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి. స్థల గృహ విక్రయాలకు అనుకూలం. వాహనాల కొనుగోలుకు అనుకూలం. కుటుంబ సౌఖ్యం. సంతాన వృద్ధి. ఉన్నత విద్య. ఈ రాశివారికి గోచారరీత్యా ఏలినాటిశని కావున వీరు ఈ వారమంతా రోజూ ఓం నమశ్శివాయ అని మంత్రమును 21సార్లు పఠించిన శుభం జరుగును.
సంఘంలో గౌరవం. ఆరోగ్యం బాగుంటుంది. తెలివిగా వ్యవహరిస్తారు. ధార్మిక, యోగ విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరమైన చిక్కులు. కుటుంబంలో ఇబ్బందులు. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. అధిక ఖర్చు. చోర భయం. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత లోపిస్తాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాశివారికి గోచారరీత్యా ఏలినాటి శని కావున వీరు ఓం శనీశ్వరాయ నమః అని మంత్రులను రోజు 21 సార్లు జపించిన శుభం జరుగును.
ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)